‘బిగ్‌బాస్’ వివాదం: నలుగురికి ముందస్తు బెయిల్
‘బిగ్‌బాస్’ కార్యక్రమంపై జర్నలిస్ట్ శ్వేతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో నలుగురికి ముందస్తు బెయిల్ లభించింది. షో కోసం తనను సంప్రదించి, ఎంపిక చేసి, అగ్నిమెంట్ తరువాత.. మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? మా బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తారు? అంటూ నిర్వాహకులు తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ షో నిర్వాహకుడు శ్యాంతో పాటు రవికాంత్, రఘ, శశికాంత్‌లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న […]
‘బిగ్‌బాస్’ కార్యక్రమంపై జర్నలిస్ట్ శ్వేతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో నలుగురికి ముందస్తు బెయిల్ లభించింది. షో కోసం తనను సంప్రదించి, ఎంపిక చేసి, అగ్నిమెంట్ తరువాత.. మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? మా బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తారు? అంటూ నిర్వాహకులు తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ షో నిర్వాహకుడు శ్యాంతో పాటు రవికాంత్, రఘ, శశికాంత్‌లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న వారు బుధవారం నాంపల్లి కోర్టులో ముందుస్తు బెయిల్ పొందారు. కాగా మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసులు ఛానెల్ అడ్మిన్ హెడ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.