ఆ జంట రొమాన్స్.. బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ షురూ!

‘బిగ్ బాస్ 3’లో 14, 15 పార్టిసిపెంట్స్‌గా భార్యాభర్తలు హీరో వరుణ్ సందేశ్, వితిక షేరు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రెండు సీజన్స్‌లో జంటలతో కూడిన కంటెస్టెంట్లు పాల్గొనలేదు కాబట్టి.. ఈ సీజన్‌లో రొమాన్స్ పాళ్ళు ఎక్కువగానే ఉంటుందని ప్రేక్షకులు భావించారు. అందుకేనేమో వారిద్దరి రొమాన్స్.. షోకు టీఆర్పి రేటింగ్ తెస్తుందని నిర్వాహకులు కూడా సెలెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇకపోతే షో మొదటి రోజు నుంచే మాటల యుద్ధం, గొడవలు, రొమాన్స్ స్టార్ట్ […]

ఆ జంట రొమాన్స్.. బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ షురూ!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 25, 2019 | 4:57 PM

‘బిగ్ బాస్ 3’లో 14, 15 పార్టిసిపెంట్స్‌గా భార్యాభర్తలు హీరో వరుణ్ సందేశ్, వితిక షేరు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రెండు సీజన్స్‌లో జంటలతో కూడిన కంటెస్టెంట్లు పాల్గొనలేదు కాబట్టి.. ఈ సీజన్‌లో రొమాన్స్ పాళ్ళు ఎక్కువగానే ఉంటుందని ప్రేక్షకులు భావించారు. అందుకేనేమో వారిద్దరి రొమాన్స్.. షోకు టీఆర్పి రేటింగ్ తెస్తుందని నిర్వాహకులు కూడా సెలెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది.

ఇకపోతే షో మొదటి రోజు నుంచే మాటల యుద్ధం, గొడవలు, రొమాన్స్ స్టార్ట్ అయిపోయాయి. అలాగే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత వరుణ్ సందేశ్, వితిక రొమాంటిక్ మూమెంట్‌ను షేర్ చేసుకున్నారు. ఎలిమినేషన్స్‌లో ఉండడమో.. లేక మరేదో కారణమో తెలియదు గానీ వితిక కొంత డిస్టర్బ్‌గా మాత్రం కనిపించింది. అప్పుడు వరుణ్ సందేశ్.. వితికను కాస్త ఓదార్చగా.. వితిక కూడా వరుణ్ మీద తనకున్న ప్రేమను బయటపెట్టింది. ఆ సమయంలోనే భర్త తనకు ‘ఐ లవ్ యూ’ చెప్పట్లేదని.. నాగార్జున గారితో చెప్పి నెక్స్ట్ వారం పనిష్మెంట్ ఇప్పిస్తానంటూ జోక్ వేసింది. అదే మూమెంట్‌లో వరుణ్.. వితికాను హగ్ చేసుకోగా.. ఆ సీన్ కాస్తా కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై కామెడీ మేమెస్ చేసి నెటిజన్లు హల్‌చల్ చేస్తున్నారు.

ఏది ఏమైనా బిగ్ బాస్ నిర్వాహకులు కోరుకున్నట్లు హౌస్‌లోకి వచ్చిన రెండో రోజు నుంచే ప్రేక్షకులకు కావాల్సినంత మసాలా దొరుకుతోందని చెప్పాలి.