ఆమె పవన్ టాటూ వేయించుకుంది: తనే బిగ్‌బాస్ విన్నర్..!
పవన్ కల్యాణ్.. ఈ పేరుకు ఓ మానియా ఉంది. పవన్‌కు దేశమంతా వీరాభిమానులు ఎక్కువే. ఆయన ఊ.. అంటే చాలు.. చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యేంత అభిమానులు ఆయన సొంతం. పవన్ రాజకీయాల్లోకి వెళ్లి.. హాట్‌టాపిక్‌గా నిలిచారు. ఇప్పుడు ఆయన మళ్లీ ఎందుకు గుర్తొచ్చారంటే.. బిగ్‌బాస్-3 కంటెస్టెంట్ అషూ రెడ్డి వల్ల.. ఆమె పవన్‌కు వీరాభిమాని అట. ఆయన పేరును తన హార్ట్‌పై టాటూగా వేయించుకుని.. ఏకంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అషు మరోసారి వార్తల్లోకెక్కారు. […]
పవన్ కల్యాణ్.. ఈ పేరుకు ఓ మానియా ఉంది. పవన్‌కు దేశమంతా వీరాభిమానులు ఎక్కువే. ఆయన ఊ.. అంటే చాలు.. చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యేంత అభిమానులు ఆయన సొంతం. పవన్ రాజకీయాల్లోకి వెళ్లి.. హాట్‌టాపిక్‌గా నిలిచారు. ఇప్పుడు ఆయన మళ్లీ ఎందుకు గుర్తొచ్చారంటే.. బిగ్‌బాస్-3 కంటెస్టెంట్ అషూ రెడ్డి వల్ల.. ఆమె పవన్‌కు వీరాభిమాని అట. ఆయన పేరును తన హార్ట్‌పై టాటూగా వేయించుకుని.. ఏకంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అషు మరోసారి వార్తల్లోకెక్కారు. దీంతో.. ఆమెకు ఫాలోవర్స్ భారీగా పెరిగిపోయారు.
బిగ్‌బాస్-3లో అషూ రెడ్డి ఎంట్రీ చూసిన జనం ముందు అవాక్కయ్యారు. వీడియోస్‌లో స్లిమ్‌గా.. సమంతాలా కనిపించే ఈ అమ్మడు.. ఒకేసారి బొద్దుగా దర్శనమిచ్చేసరికి ట్రోల్స్ మొదలయ్యాయి. అప్పుడు ఈ వార్త తెగ వైరల్ అయ్యింది కూడా. ఇప్పుడు ఇక అసలు విషయనికొస్తే.. పవర్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్ అయిన అషు రెడ్డి బిగ్‌బాస్ సీజన్-3లో ఉండటంతో.. ఆమెనే విన్నర్ అనే ట్రోల్స్ కూడా ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఇందుకు పవన్ అభిమానులు కూడా ఫుల్‌గా మద్దతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. బిగ్‌బాస్-3లో ఆమెనే విజేతనా..? లేక మధ్యలోనే ఎలిమినేషన్ అయిపోతుందా..! పవన్ ఫ్యాన్స్ ఆమెకు సహాయం అందిస్తారా.. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..! ఎందుకంటే అది బిగ్‌బాస్ హౌస్ ఏదైనా జరగవచ్చు.