బిగ్‌బాస్ 3: తమన్నాను తిడుతున్న నెటిజన్లు
తప్పు చేసినందుకు కాదు.. కొన్ని సార్లు ఎవరో చేసిన తప్పులకు మనం తిట్లు తినాల్సి వస్తుంటుంది. ఇక సోషల్ మీడియా వచ్చిన తరువాత నెటిజన్లు సెలబ్రిటీలకు ట్యాగ్ చేస్తూ మరీ వారిని తిడుతుంటారు. అయితే అక్కడే అసలు సమస్య వస్తోంది. ఎవరైనా తప్పు చేసినప్పుడు వారి పేరు మీద ఉన్న మరో సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తుంటారు నెటిజన్లు. ఇప్పుడు ఇలాంటి తలనొప్పే మిల్కీ బ్యూటీ తమన్నాకు ఎదురైందట. తెలుగులో విజయవంతంగా కొనసాగుతున్న బిగ్‌బాస్ 3లోకి ట్రాన్స్‌జెండర్ తమన్నా […]

తప్పు చేసినందుకు కాదు.. కొన్ని సార్లు ఎవరో చేసిన తప్పులకు మనం తిట్లు తినాల్సి వస్తుంటుంది. ఇక సోషల్ మీడియా వచ్చిన తరువాత నెటిజన్లు సెలబ్రిటీలకు ట్యాగ్ చేస్తూ మరీ వారిని తిడుతుంటారు. అయితే అక్కడే అసలు సమస్య వస్తోంది. ఎవరైనా తప్పు చేసినప్పుడు వారి పేరు మీద ఉన్న మరో సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తుంటారు నెటిజన్లు. ఇప్పుడు ఇలాంటి తలనొప్పే మిల్కీ బ్యూటీ తమన్నాకు ఎదురైందట.
తెలుగులో విజయవంతంగా కొనసాగుతున్న బిగ్‌బాస్ 3లోకి ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి హీరోయిన్ తమన్నా ట్విట్టర్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ వేల కొద్ది ట్వీట్లు వస్తున్నాయట. అందులో నెగిటివ్ ట్వీట్లు కూడా ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక మిల్కీ బ్యూటీ తలపట్టుకున్నారట. ఆ ట్యాగ్ చేసే నెటిజన్లు కాస్త ఆలోచించి పెట్టొచ్చు కదా అని ఆమె ఫీల్ అవుతుందట. ఏదేమైనా తమన్నా బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగేవరకు మిల్కీ బ్యూటీకి ఈ తిప్పలు తప్పవంటున్నారు కొందరు.




