బిగ్‌బాస్ 3: శ్రీముఖికి మళ్లీ షాక్.. ఇక ఇంటికేనా..?
‘బిగ్‌బాస్’ మూడో సీజన్ క్లైమాక్స్‌కు చేరింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా.. మిగిలిన ఐదుగురు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న శ్రీముఖి, అలీ, బాబా భాస్కర్, వరుణ్, శివజ్యోతిలకు ఫైనల్‌లో చుక్కలు చూపిస్తున్నాడు బిగ్‌బాస్. అర్ధరాత్రి పూట సైరన్‌ను మోగించి.. ఈ ఐదుగుర్ని బ్యాగ్‌లు సర్దుకొని గార్డెన్ ఏరియాలోకి రావాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించారు. ఆ తరువాత వారిని బిగ్‌బాస్ హౌస్‌లో వారి జర్నీ […]
‘బిగ్‌బాస్’ మూడో సీజన్ క్లైమాక్స్‌కు చేరింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా.. మిగిలిన ఐదుగురు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న శ్రీముఖి, అలీ, బాబా భాస్కర్, వరుణ్, శివజ్యోతిలకు ఫైనల్‌లో చుక్కలు చూపిస్తున్నాడు బిగ్‌బాస్. అర్ధరాత్రి పూట సైరన్‌ను మోగించి.. ఈ ఐదుగుర్ని బ్యాగ్‌లు సర్దుకొని గార్డెన్ ఏరియాలోకి రావాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించారు. ఆ తరువాత వారిని బిగ్‌బాస్ హౌస్‌లో వారి జర్నీ గురించి చెప్పమని ఆదేశించారు. దీంతో ఒక్కొక్కరుగా తమ తమ జర్నీని ఎమోషనల్‌గా షేర్ చేసుకున్నారు. ఆ తరువాత వారందరికీ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్.
ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న బాబా భాస్కర్‌ను ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా రక్షించారని అతడిని సేవ్ చేస్తూ.. టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్‌గా ప్రకటించాడు. అనంతరం కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి బాబాకు టికెట్ టు ఫినాలేను అందించాడు. ఈ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ తనను గెలిపించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ.. టికెట్‌ను ఆడియెన్స్‌కు డెడికేట్ చేశాడు బాబా. ఆ తరువాత ఆ టికెట్‌ను తీసుకెళ్లి.. శ్రీముఖి చేతిలో పెట్టి.. బిగ్‌బాస్ దీన్ని నీకు ఇవ్వమన్నారు అంటూ ఆటపట్టించారు.
ఇక ఈ వారం బాబా సేఫ్ కావడంతో మరో నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. శ్రీముఖి సేఫ్ అవుతుందని అంతా అనుకున్నా కూడా ఊహించని విధంగా బాబాకు ఛాన్సిచ్చారు ఆడియన్స్. దాంతో మిగిలిన నలుగురులో ఎవరు బయటికి వచ్చేస్తారనేది ఆసక్తికరంగా మారిపోయింది. మరోవైపు శ్రీముఖిని ఎలాగైనా గెలిపించాలని బయట ఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆమె కొనసాగుతుందా..? ఈ వారం ఎలిమినేట్ అవుతుందా..? అన్నది ఆసక్తిగా మారింది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అలీ రెజా ఎలిమినేట్ అవుతాడనేది తెలుస్తోంది. మధ్యలో మూడు వారాలు బయటికి వెళ్లి రావడం.. వైల్డ్ కార్డ్ నుంచి రావడంతో అలీని ఎలిమినేట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అతడితో పాటు శివజ్యోతి పేరు కూడా వినిపిస్తోంది.