5

బిగ్‌బాస్‌ షోపై రాహుల్ బూతుపురాణం.. వైరల్ అవుతోన్న వీడియో..!

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3తో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ అందరికీ పరిచయమయ్యాడు. పున్నుతో కాస్త రొమాన్స్‌ చేస్తూ.. ఇంటిలో లవర్‌గా పాగా వేశాడు. దీంతో.. పాటుగా అతని మాట దురుసు కారణంగా.. పలు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. అలాగే.. అతను గేమ్‌పై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు అంతగా కనిపించేది కాదు. అందులోనూ.. మొదటి నుంచి ఎక్కువగా ఎలిమినేషన్‌లో నామినేట్ అవుతూ వచ్చాడు. బిగ్‌బాస్ 3 హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచీ.. అతను సరిగా.. గేమ్స్‌పై.. టాస్క్‌లపై ఫోకస్ […]

బిగ్‌బాస్‌ షోపై రాహుల్ బూతుపురాణం.. వైరల్ అవుతోన్న వీడియో..!
Follow us

| Edited By:

Updated on: Oct 26, 2019 | 10:48 AM

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3తో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ అందరికీ పరిచయమయ్యాడు. పున్నుతో కాస్త రొమాన్స్‌ చేస్తూ.. ఇంటిలో లవర్‌గా పాగా వేశాడు. దీంతో.. పాటుగా అతని మాట దురుసు కారణంగా.. పలు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. అలాగే.. అతను గేమ్‌పై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు అంతగా కనిపించేది కాదు. అందులోనూ.. మొదటి నుంచి ఎక్కువగా ఎలిమినేషన్‌లో నామినేట్ అవుతూ వచ్చాడు. బిగ్‌బాస్ 3 హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచీ.. అతను సరిగా.. గేమ్స్‌పై.. టాస్క్‌లపై ఫోకస్ చేయకుండా వస్తూ వచ్చాడు. మొత్తానికి అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి లాగా.. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచి ఫైనల్‌కి చేరాడు.

కాగా.. ఈ పీక్స్‌ టైంలో.. రాహుల్ సిప్లిగంజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఈ వీడియోతో.. రాహుల్‌కి చెక్ పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాహుల్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా ఆ వీడియో ఉంది. ఈ వీడియో దెబ్బకి రాహుల్‌కి బిగ్‌బాస్‌ విన్నర్ అయ్యే అవకాశం కూడా చేజారిపోయినట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటా అనుకుంటున్నారా..? తెలుగు బిగ్‌బాస్ సీజన్‌ 1లో రాహుల్ సిప్లిగంజ్ పాడిన మంగమ్మ పాటను హౌస్‌లో ప్లే చేశారు. ఈ మంగమ్మ పాటపై.. కంటెస్టెంట్స్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌కి కోపంతో ఊగిపోయిన రాహుల్.. ఓ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో రాహుల్ బీభత్సకరమైన బూతు పదాలను వాడినట్టు తెలుస్తోంది. ఇది చూసిన వారందరూ.. షాక్‌కి గురవుతున్నారు. అయితే.. అప్పుడెప్పుడో.. సీజన్ 1 వీడియో.. ఇప్పుడు రివీల్ కావడం పట్ల.. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని రాహుల్ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.