ప్రేక్షకుల తీర్పు అదేనా..? అక్కాతమ్ముళ్లకు చెక్ పడుతుందా..?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం ఈ షో టాప్ రేటింగ్‌తో ముందుకు దూసుకెళ్తుంది. కొట్లాటలు.. తిట్టులతో.. ఇప్పటిదాకా నడిచిన ఈ షో.. చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే ముగింపుదశకు చేరుకున్న ఈ షోకి.. మరో వారంలోనే శుభం కార్డ్ పడనుంది. ఆది నుంచి ఇప్పటివరకూ.. ఫుల్ కాంట్రవర్సియల్ షోగా బిగ్‌బాస్ 3 నిలుస్తుందనే చెప్పవచ్చు. కాగా.. టైం దగ్గర పడే కొద్దీ.. బిగ్‌బాస్‌లో ఊహించని ట్వీస్ట్‌లు ఎదురవుతోన్నాయి. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఆరుగురు ఉన్నారు. […]

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం ఈ షో టాప్ రేటింగ్‌తో ముందుకు దూసుకెళ్తుంది. కొట్లాటలు.. తిట్టులతో.. ఇప్పటిదాకా నడిచిన ఈ షో.. చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే ముగింపుదశకు చేరుకున్న ఈ షోకి.. మరో వారంలోనే శుభం కార్డ్ పడనుంది. ఆది నుంచి ఇప్పటివరకూ.. ఫుల్ కాంట్రవర్సియల్ షోగా బిగ్‌బాస్ 3 నిలుస్తుందనే చెప్పవచ్చు. కాగా.. టైం దగ్గర పడే కొద్దీ.. బిగ్‌బాస్‌లో ఊహించని ట్వీస్ట్‌లు ఎదురవుతోన్నాయి.
ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఆరుగురు ఉన్నారు. అందులో ఇద్దరు అంటే.. రాహుల్, బాబా మాస్టర్‌లు సేవ్ అయి ఫైనల్‌కి చేరుకున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో.. వరుణ్ సందేశ్, అలీ, శివజ్యోతి, శ్రీముఖి ఉన్నారు. దీంతో.. ఈ సారి ఎలిమినేషన్‌లో టఫ్ ఫైట్ నెలకొంది. అందులోనూ.. షో ముగింపుదశకు చేరుకోవడంతో.. ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్స్ బయటకు వెళ్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆ రేసులో.. అక్కాతమ్ముళ్లు అంటే.. శివజ్యోతి, అలీ రేజాలు బయటకెళ్తారని సమాచారం. ముందు నుంచీ శ్రీముఖికి ఫ్యాన్స్ మద్దతు ఉంది. దీంతో.. ఆమెనే బిగ్‌బాస్ విన్నర్ అని అంటున్నారు. ఫైనల్స్‌కి శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్‌లు నిలుస్తారని తెలుస్తోంది. కానీ.. అది బిగ్‌బాస్ హౌస్ ఏదైనా జరగొచ్చు. కంటెస్టెంట్స్ వారీగా వారి ప్లస్‌లు.. మైనస్‌లు ఏంటంటే..!
వరుణ్ సందేశ్: ముందు నుంచీ.. వరుణ్ సందేశ్ పాజిటీవ్‌గా ఉంటూ వచ్చాడు. హౌస్‌లో ఎవరితోనూ.. ఎక్కువగా గొడవలు లేవు. ఎప్పుడూ న్యాయంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇవి అతనికి ప్లస్ పాయింట్స్ కాగా.. ఇదివరకు.. షో స్టాటింగ్ నుంచి పునర్నవి, రాహుల్‌తో క్లోజ్‌నెజ్ కాస్త దెబ్బకొట్టొచ్చు.
అలీ రెజా: ముందు ఎలిమినేట్ అయి.. మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి అలీకి ప్లస్‌ల కన్నా మైనస్ పాయింట్స్‌నే ఎక్కువని చెప్పాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత.. అతని మాట తీరు కానీ… చర్యలు కానీ.. కాస్త విచిత్రంగా ఉన్నాయి. ఇప్పటికే నాగార్జున కూడా.. అతనికి వార్గింగ్ ఇచ్చారు. కానీ.. ఆలీ రెజాకు సోషల్‌మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.
శివజ్యోతి: హౌస్‌లో ఎక్కువగా ఎమోషనల్ అయ్యేది ఎవరంటే.. తడుముకోకుండా.. శివజ్యోతి అనే అంటారు అందరు. హౌస్‌లో ఇతర కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇచ్చింది శివజ్యోతి. కొన్ని కొన్ని తగాదాలు ఉన్నా వెంటనే మొహం మీదనే అడిగి.. డౌట్స్ క్లారిఫై చేసుకుంటుంది. అదే ఆమెకు మైనస్ పాయింట్‌గా ఉంది. అందులోనూ.. ప్రేక్షకుల తీర్పుతో.. టాప్ 5లోకి వెళ్లినా.. విన్నర్ అయితే కానది.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
శ్రీముఖి: హౌస్‌లో జోష్ నింపుతూ.. అందర్నీ నవ్విస్తూ.. ఉంటూ.. తన ఆటను ఫేక్‌గా ఆడుతోంది. ముందు నుంచీ ఆమెనే బిగ్‌బాస్ విన్నర్ అని పలు ఊహాగానాలు.. వార్తల్లో న్యూస్‌లు వస్తూ వచ్చాయి. అంతేకాకుండా.. ఆమె పేరిట సోషల్ మీడియాలో ఆర్మీలు కూడా తెగ హల్‌చల్ చేస్తున్నాయి. మొత్తానికి ఎటు చూసినా.. ఈ వారం.. హౌస్ నుంచి అలీ, శివజ్యోతిలు వెళ్తారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.