Big News Big Debate: జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత మిస్‌ అయిందా?.. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఏర్పాటయ్యాయా? జిల్లాలపై రాజకీయ లొల్లి

Big News Big Debate: APలో కొత్త జిల్లాలపై సరికొత్త రాజకీయ రగడ మొదలైంది. అఖిలపక్షం వేయలేదు.. ప్రజాభిప్రాయాలు పట్టించుకోలేదని విపక్షాలు ఆరోపిస్తుంటే, ప్రజా ప్రయోజనాలే..

Big News Big Debate: జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత మిస్‌ అయిందా?.. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఏర్పాటయ్యాయా? జిల్లాలపై రాజకీయ లొల్లి
Follow us
Subhash Goud

|

Updated on: Apr 06, 2022 | 12:04 AM

Big News Big Debate: APలో కొత్త జిల్లాలపై సరికొత్త రాజకీయ రగడ మొదలైంది. అఖిలపక్షం వేయలేదు.. ప్రజాభిప్రాయాలు పట్టించుకోలేదని విపక్షాలు ఆరోపిస్తుంటే, ప్రజా ప్రయోజనాలే ప్రాధాన్యతగా విభజించామంటోంది ప్రభుత్వం. జనాలపై పన్నుల భారం మోపడానికి కొత్త జిల్లాలు (New Districts) చేశారని టీడీపీ (TDP) విమర్శిస్తే.. 14 ఏళ్లు సీఎం చేసిన అనుభవంతో ఆనాడే ఎందుకు చేయలేదని కౌంటర్‌ ఎటాక్‌ చేసింది వైసీపీ (YCP). ఎర్ర జెండాలు, జనసేనలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపైనా లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కౌంటర్‌ ఎటాక్‌ చేస్తోంది అధికార పార్టీ.

అందరి అభిప్రాయాలు విశాల ప్రయోజనాలు ఆలోచించే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వమంటే.. రాజకీయ ప్రయోజనాలు తప్ప ఎక్కడా శాస్త్రీయతే లేదంటున్నాయి విపక్షాలు. జనాల అభిప్రాయాలకు విలువ లేదు. అఖిలపక్షమూ వేయలేదంటూ నిలదీస్తోంది లెఫ్ట్‌. జనసేన ఓ అడుగు ముందుకేసి అడ్డదిడ్డంగా చేసిన జిల్లాల పునర్విభజనను భవిష్యత్తులో సరిచేస్తామంటోంది.

ఏపీలో జరిగింది జిల్లాల విభజన కాదని.. మరో జగనన్న బాదుడు కార్యక్రమం అంటోంది తెలుగుదేశం. రాష్ట్రాన్ని అప్పలపాలు చేసిన ప్రభుత్వం ప్రజలపై పన్నుల ద్వారా ఆదాయం రాబట్టేందుకు ఇప్పటికిప్పుడు జిల్లాల విభజన చేసిందంటోంది. మూడు నెలల క్రితం ఇంటిపన్నుల పెంచుతూ చట్టం చేసిన ప్రభుత్వం… కొత్త జిల్లా కేంద్రాల పేరుతో ఆస్తుల విలువ పెంచి మరో 15 శాతం బాదడానికి రంగం సిద్ధం చేసిందన్నారు. మరోవైపు వైసీపీ నాయకుల దోపిడీ కేంద్రాలుగా కొత్త జిల్లాలు మారాయంటోంది.

43ఏళ్ల తర్వాత కొత్త జిల్లాలు చేసుకుంటే విపక్షాలకు జీర్ణించుకోలేకపోతున్నాయంటోంది వైసీపీ. చంద్రబాబునాయుడు పంపిన లెటర్‌పై సంతకం చేసి పవన్‌ ప్రకటన విడుదల చేస్తే.. టీడీపీకి గొడుగుగా మారిన లెఫ్ట్‌ పార్టీలు అఖిలపక్షం అంటూ అల్లరిచేస్తున్నాయంటోంది అధికారపార్టీ. కొత్త జిల్లాలతో సరికొత్తగా ముస్తాబై రాష్ట్రమంతా పండగలా ఉంటే విపక్షాలకు మాత్రం కడుపుమంటగా మారిందన్నారు.

జిల్లాల ఏర్పాటును పార్టీలన్నీ స్వాగతిస్తున్నాయి.. కానీ జరిగిన తీరుపై అభ్యంతరాలు చెబుతున్నాయి. కొన్ని డిమాండ్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం శాస్త్రీయంగానే అన్నీ ఆలోచించి మరీ జిల్లాల విభజన జరిగిందంటోంది. నిజంగానే జిల్లాల విభజనలో తప్పులు జరిగాయా? లేక రాజకీయాస్త్రంగా విపక్షాలు మార్చుకుంటున్నాయా?

– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఇవి కూడా చదవండి:

TELANGANA ELECTIONS: ముందస్తు మోతకు పార్టీల కదనోత్సాహం.. గులాబీ పార్టీని ఢీకొట్టేందుకు బరిలోకి జాతీయ పార్టీలు

Chandrababu Naidu: సంక్షోభం దిశగా ఏపీ.. చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు

మీ పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా ఉందా? యాక్టివేట్ చేసుకోండిలా!
మీ పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా ఉందా? యాక్టివేట్ చేసుకోండిలా!
ఈ ఆలయంలో వింత సంప్రదాయం .. అమ్మవారికి నైవేద్యంగా గోరింటాకు..
ఈ ఆలయంలో వింత సంప్రదాయం .. అమ్మవారికి నైవేద్యంగా గోరింటాకు..
'కూటమి సర్కార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగిస్తుంది' మంత్రి
'కూటమి సర్కార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగిస్తుంది' మంత్రి
హనీమూన్‏లో తన స్నేహితులతో గడపాలని చెప్పాడు.. హీరోయిన్
హనీమూన్‏లో తన స్నేహితులతో గడపాలని చెప్పాడు.. హీరోయిన్
PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌