AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: సంక్షోభం దిశగా ఏపీ.. చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh News: సంక్షోభం దిశగా ఏపీ పయనిస్తోందంటూ  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒక్కో కుటుంబంపై ఏడాదికి లక్ష భారం పడుతోందన్నారు.

Chandrababu Naidu: సంక్షోభం దిశగా ఏపీ.. చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు
Chandrababu Naidu(File Photo)
Janardhan Veluru
|

Updated on: Apr 05, 2022 | 4:24 PM

Share

Andhra Pradesh News: సంక్షోభం దిశగా ఏపీ పయనిస్తోందంటూ  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ఆరోపించారు. ఒక్కో కుటుంబంపై ఏడాదికి లక్ష భారం పడుతోందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆయన ట్వీట్‌ చేశారు. సంక్షేమ పథకాలకు పది శాతం పంచి.. మిగిలిన 90 శాతం దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. గతంలో సంతోషంగా, సంక్షేమంగా సాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాణం ఇప్పుడు సంక్షోభం దిశగా పయనిస్తోందని అందులో పేర్కొన్నారు. చెత్త పన్నులు, పెరిగిన కరెంటు చార్జీలు, భగ్గుమంటున్న నిత్యావసరల ధరలతో ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయన్నారు.

ఇసుక, మద్యం వంటి వాటితో జరిగే దోపిడీ సరేసరి, వైసీపీ సర్కార్ బాదుడే బాదుడు విధానంతో రాష్ట్ర ప్రజలు విలవిల్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మీ కష్టార్జితాన్ని పిండుకుని, తాను దర్జాగా దండుకుంటున్న జగన్ పాలనపై ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. తాను అప్పులు చేస్తూ, వాటి కోసం జనం జేబులు ఖాళీ చేస్తున్న ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలన్నారు. ప్రభుత్వ పన్నులు, బాదుడుపై తాము చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

Also Read..

Credit Card: క్రెడిట్ కార్డ్ ఇలా ఉపయోగిస్తున్నారా.. అయితే మీ పని ఖాళీనే జాగ్రత్త..

Indian Railway: రైల్వే ప్రయాణికులకి బ్యాడ్‌న్యూస్.. ఏప్రిల్ 15 నుంచి ఆ టికెట్ల ధరలు పెరిగే అవకాశం..!