AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: అటు టీడీపీ దీక్ష… పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్షలు.. ఏపీలో రాజకీయ రణరంగం..

ఒక్క పదం. ఒకే ఒక్క పదం. APని రాజకీయ రణరంగంగా మార్చేసింది. ఘర్షణలు, కేసులు, అరెస్ట్‌లు, దీక్షలతో అట్టుడుకుతోంది. గల్లీలో తలపడుతున్న..

Big News Big Debate: అటు టీడీపీ దీక్ష... పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్షలు.. ఏపీలో రాజకీయ రణరంగం..
Big News Big Debate On Ap Political Fight Live Video 21 10 2021
Ravi Kiran
|

Updated on: Oct 21, 2021 | 9:55 PM

Share

ఒక్క పదం. ఒకే ఒక్క పదం. APని రాజకీయ రణరంగంగా మార్చేసింది. ఘర్షణలు, కేసులు, అరెస్ట్‌లు, దీక్షలతో అట్టుడుకుతోంది. గల్లీలో తలపడుతున్న పార్టీలు ఇప్పుడు ఢిల్లీలో ఫైటింగ్‌కు బలగాలను మోహరిస్తున్నాయి. ఇక హస్తిన వేదికగా బూతుపురాణాలు రీసౌండ్‌ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ లేదంటున్న TDP రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌ చేస్తుంటే.. బూతులు మాట్లాడే పార్టీకి జనాల్లో ఉండే అర్హత లేదంటూ గుర్తింపు రద్దుపై ECకి ఫిర్యాదు చేస్తామంటోంది YCP.

TDP ఆఫీస్‌పై దాడి ఘటనను CBIతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత పయ్యవుల కేశవ్. CC ఫుటేజ్ మొత్తం పరిశీలిస్తే ఏం జరిగిందన్నది మొత్తం బయటకు వస్తుందన్నారు. చిత్తశుద్ధి ఉంటే CBI విచారణ కోరుతూ CM జగన్ లేఖ రాయాలన్నారు పయ్యావుల. నాడు అమిత్‌షా వచ్చినప్పుడు చేసిన దాడి ఏంటని.. దీనిపై విచారణకు ఆదేశించారా అని ఎదురు ప్రశ్నిస్తోంది వైసీపీ.

అటు రీజినల్‌ పార్టీల మధ్య ఫైట్‌ కాస్తా.. నేషనల్‌ కేపిటల్‌కు మారుతోంది. గల్లీలో తలపడుతున్న పార్టీలు ఇక ఢిల్లీలో తేల్చుకుంటామని సవాళ్లు విసురుకుంటున్నాయి. ఒకప్పుడు ఆర్టికల్‌ 356కు వ్యతిరేకంగా ఉద్యమించిన తెలుగుదేశమే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటోంది. శాంతి భద్రతులు లేవని.. రాష్ట్ర ప్రభుత్వమే ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రికి లేఖలు రాసిన చంద్రబాబు.. దీక్ష అనంతరం ఢిల్లీ వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయబోతున్నారు. అటు టీడీపీపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లబోతున్నారు వైసీపీ నేతలు. ఈసీని కలిసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేయబోతున్నారు. టీడీపీ లాంటి పార్టీ రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని, గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ని కోరతామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.