Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బహ్రెయిన్ రాజు ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా కన్నుమూత

దశాబ్దాలుగా బహ్రెయిన్‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆ దేశ రాజు ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా బుధవారం కన్నుమూశారు.

బహ్రెయిన్ రాజు ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా కన్నుమూత
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 11, 2020 | 4:46 PM

దశాబ్దాలుగా బహ్రెయిన్‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆ దేశ రాజు ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా బుధవారం కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఖలీఫా అమెరికాలోని మయో క్లినిక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. అయితే, ఆయన మృతికి గల కారణాలను మాత్రం రాయల్‌ ప్యాలెస్‌ వెల్లడించలేదు. ఖలీఫా మృతితో బహ్రెయిన్‌ ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.

1935లో జన్మించిన ఖలీఫా 1970 నుంచి ఆ దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రపంచంలోనే సుదీర్ఘకాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన నేతల్లో ఖలీఫా ఒకరు. 2011లో ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఖలీఫాను తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అయినప్పటికీ వాటన్నింటి నుంచి గట్టెక్కిన ఖలీఫా దశాబ్దాలుగా ప్రధానిగా కొనసాగారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన అధికారాలను కొంత తగ్గిస్తూ రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేశారు. అనంతరం గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అమెరికాలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షిణించడంతో బుధవారం మృతి చెందినట్లు ప్రకటించారు.

నరసింహాలో నీలాంబరి పాత్ర.. ఆమెను చూసి రాశానని చెప్పిన డైరెక్టర్..
నరసింహాలో నీలాంబరి పాత్ర.. ఆమెను చూసి రాశానని చెప్పిన డైరెక్టర్..
P-4 సొసైటీ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, వైఎస్ చైర్మన్‌గా పవన్..
P-4 సొసైటీ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, వైఎస్ చైర్మన్‌గా పవన్..
తండ్రికి క్యాన్సర్.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..
తండ్రికి క్యాన్సర్.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..
ఛార్జీల బాదుడు.. మీరు ATM నుంచి విత్‌డ్రా చేస్తున్నారా?
ఛార్జీల బాదుడు.. మీరు ATM నుంచి విత్‌డ్రా చేస్తున్నారా?
ఒంటి కాలిపై ఎంతసేపు నిలబడగలరో టెస్ట్‌ చేసుకోండి..? ఎన్ని లాభాలంటే
ఒంటి కాలిపై ఎంతసేపు నిలబడగలరో టెస్ట్‌ చేసుకోండి..? ఎన్ని లాభాలంటే
కాంగ్రెస్ నేత, తమిళిసై తండ్రి కుమారి అనంతన్ కన్నుమూత..
కాంగ్రెస్ నేత, తమిళిసై తండ్రి కుమారి అనంతన్ కన్నుమూత..
స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఆధార్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఫీచర్‌..!
స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఆధార్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఫీచర్‌..!
ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యిని ఇలా తీసుకుంటే..ఎంతటి రోగమైనా మాయం!
ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యిని ఇలా తీసుకుంటే..ఎంతటి రోగమైనా మాయం!
సింగపూర్‌ చేరుకున్న చిరంజీవి, పవన్‌కళ్యాణ్..
సింగపూర్‌ చేరుకున్న చిరంజీవి, పవన్‌కళ్యాణ్..
ఏమాత్రం తగ్గేదేలే.. చైనాపై భారీ సుంకం విధించిన ట్రంప్‌..
ఏమాత్రం తగ్గేదేలే.. చైనాపై భారీ సుంకం విధించిన ట్రంప్‌..