8 రోజుల్లోగా 30 శాతం దళాలను తగ్గించి వెనక్కి తగ్గుతాం, చైనా
భా రత-చైనా దేశాల మధ్య లడాఖ్ ‘లడాయి’ నేపథ్యంలో చైనా కాస్త దిగివచ్చింది. వాస్తవాధీన రేఖ వద్ద ఫ్రిక్షన్ పాయింట్ నుంచి దశలవారీగా 8 రోజుల్లోగా వెనక్కి వెళ్లేందుకు చైనా అంగీకరించినట్టు తెలుస్తోంది. అంటే 30 శాతం దళాలను ఉపసంహరించుకుంటామని ఆ దేశం స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నెల 6 న ఛుషుల్ వద్ద కమాండర్ల స్థాయిలో 8 వ దఫా చర్చలు జరిగాయి. ఆ చర్చల పర్యవసానంగా తాము 30 శాతం సైనిక దళాలను […]
భా రత-చైనా దేశాల మధ్య లడాఖ్ ‘లడాయి’ నేపథ్యంలో చైనా కాస్త దిగివచ్చింది. వాస్తవాధీన రేఖ వద్ద ఫ్రిక్షన్ పాయింట్ నుంచి దశలవారీగా 8 రోజుల్లోగా వెనక్కి వెళ్లేందుకు చైనా అంగీకరించినట్టు తెలుస్తోంది. అంటే 30 శాతం దళాలను ఉపసంహరించుకుంటామని ఆ దేశం స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నెల 6 న ఛుషుల్ వద్ద కమాండర్ల స్థాయిలో 8 వ దఫా చర్చలు జరిగాయి. ఆ చర్చల పర్యవసానంగా తాము 30 శాతం సైనిక దళాలను తగ్గించుకుని వెనక్కి వెళ్లేందుకు భారత మిలిటరీ అధికారులు అంగీకరించినట్టు చెబుతున్నారు. దీంతో చైనా కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. తొమ్మిదో దఫా చర్చలు ఈ వారంలో జరిగే సూచనలున్నాయని, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మళ్ళీ ఈ భేటీలో సమగ్రంగా చర్చించవచ్చునని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇక పాక్షిక ఉపసంహరణలను డ్రోన్లు, డెలిగేషన్ సమావేశాల ద్వారా ఎప్పటికప్పుడు వెరిఫై చేయనున్నారని ఆయన తెలిపారు.