ఉత్పాదకరంగానికి కేంద్రం ప్రోత్సాహకాలు.. రూ.2 లక్షల కోట్లు కేటాయింపు

ఉత్పాదకరంగానికి కేంద్రం ప్రోత్సాహకాలు.. రూ.2 లక్షల కోట్లు కేటాయింపు

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఇంకా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక ఒడిదొడుకుల నుంచి గట్టేక్కేందుకు కేంద్ర ప్రభుత్వం మరి కొన్ని తాయిలాలను ప్రకటించింది.

Balaraju Goud

|

Nov 11, 2020 | 5:24 PM

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఇంకా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక ఒడిదొడుకుల నుంచి గట్టేక్కేందుకు కేంద్ర ప్రభుత్వం మరి కొన్ని తాయిలాలను ప్రకటించింది. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ దాదాపు 10 రంగాలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. దేశీయ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహకాలను అందజేసేందుకు రూ.2 లక్షల కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రొడక్షన్ లింక్‌డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లక్ష్యాన్ని వివరిస్తూ, 10 డిజిగ్నేటెడ్ సెక్టర్లలో మాన్యుఫ్యాక్చరింగ్‌ను పటిష్టపరుస్తామని జవదేకర్ చెప్పారు. ఇండియన్ మాన్యుఫ్యాక్చరర్స్ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఆత్మ నిర్భర్ భారత్’ కోసం పిలుపునిచ్చారని మంత్రి గుర్తు చేశారు. దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి కోసం విధానాలను రూపొందిస్తున్నట్లు జవదేకర్ తెలిపారు. మన దేశంలో పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే, పోటీని ఎదుర్కొంటాయని, తద్వారా తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటాయని తెలిపారు.

ఈ పథకం క్రింద లబ్ధి పొందే రంగాలు :

1. అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ

2. ఎలక్ట్రానిక్, టెక్నాలజీ ప్రొడక్ట్స్

3. ఆటోమొబైల్స్, ఆటో కాంపొనెంట్స్

4. ఫార్మాస్యూటికల్స్

5. టెలికాం, నెట్‌వర్కింగ్ ప్రొడక్ట్స్

6. టెక్స్‌టైల్ ప్రొడక్ట్స్

7. ఫుడ్ ప్రొడక్ట్స్

8. హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్

9. వైట్ గూడ్స్ (ఏసీలు, ఎల్ఈడీ)

10. స్పెషాలిటీ స్టీల్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu