బుర్జ్‌ ఖలీఫాపై మెరిసిన ముంబై ముత్యం

బుర్జ్‌ ఖలీఫాపై మెరిసిన ముంబై ముత్యం

ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌కు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బుర్జ్‌ఖలీఫా ఎల్‌ఈడీ లైట్లతో అభినందనలు తెలిపింది.  మంగళవారం రాత్రి బూర్జ్ ఖలీఫాపై ముంబై ఇండియన్స్ అనే అక్షరాలను ప్రదర్శించారు.

Sanjay Kasula

| Edited By: Pardhasaradhi Peri

Nov 11, 2020 | 6:15 PM

Mumbai Indians Shine on Burj Khalifa : ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన ముంబై ఇండియన్స్ జట్టుకు అరుదైన గౌరవం దక్కింది. 2013, 2015, 2017, 2019, 2020 ఇలా తన సత్తాను చాటుకున్న ముంబై ఇండియన్స్ .. అద్భుతమై రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అంతకన్న మరో ఎత్తైన రికార్డు ముంబై జట్టుతోపాటు ఆ జట్టు సారథి రోహిత్‌ సొంతం చేసుకున్నాడు.

కెప్టెన్‌గా ఐదుసార్లు ట్రోఫీని జట్టుకు అందించాడు. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్‌లోనూ ముంబైని ఛాంపియన్‌గా నిలిపి.. తన జట్టును ఎవరికీ అందనంత ఎత్తులోకి తీసుకెళ్లాడు. టీ20 లీగ్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా వడాపావ్‌ రోహిత్ శర్మ అవతరించాడు.

మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌కు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బుర్జ్ ‌ఖలీఫా ఎల్‌ఈడీ లైట్లతో అభినందనలు తెలిపింది.  మంగళవారం రాత్రి బుర్జ్‌ ఖలీఫాపై ముంబై ఇండియన్స్ అనే అక్షరాలను ప్రదర్శించారు. బాణాసంచా వెలుగు మధ్య నీలి రంగులో ముంబై ఇండియన్స్ అనే ఇంగ్లీష్ పదాలు బుర్జ్‌ ఖలీఫాపై మెరిసిపోయాయి.

విజయం అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని కూడా బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బుర్జ్‌ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం ఇదే తొలిసారి. గతంలో మహాత్మా గాంధీ, షారుక్ ఖాన్‌ల ఫొటోలను బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించారు.

ఇక ఈ సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించిన సంగతి తెలిసిందేే. అయితే ముంబై ఇండియన్స్ అక్షరాలను బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించిన ఫొటోను ముంబై తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu