క‌లిసుందామ‌న్న పాపానికి వదినను చంపిన మరిది..!

దేశ రాజధానిలో దారుణం జరిగింది. క‌లిసుందామ‌ని వేధిస్తున్నదంటూ ఓ మ‌రిది త‌న‌ వ‌దిన గొంతు పిసికి చంపేశాడు.

  • Balaraju Goud
  • Publish Date - 5:41 pm, Wed, 11 November 20
క‌లిసుందామ‌న్న పాపానికి వదినను చంపిన మరిది..!

దేశ రాజధానిలో దారుణం జరిగింది. క‌లిసుందామ‌ని వేధిస్తున్నదంటూ ఓ మ‌రిది త‌న‌ వ‌దిన గొంతు పిసికి చంపేశాడు. అనంత‌రం పోలీస్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఢిల్లీలోని క‌ర‌వాల్ ఏరియాలో దారుణం వెలుగుచూసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీలోని క‌ర‌వాల్ న‌గ‌ర్‌కు చెందిన రోహిత్ త‌న‌ త‌ల్లి, అన్నా, వ‌దిన, వారి ఇద్ద‌రు పిల్ల‌లతో క‌లిసి ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. మూడేళ్ల క్రితం రోహిత్ సోద‌రుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అనం‌త‌రం రోహిత్‌తో సహా అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇదే క్రమంలో వ‌దినతో రోహిత్ వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. రెండేళ్లు బాగానే ఉన్నా ఇటీవ‌ల ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొదలయ్యాయి. త‌ల్లిని వ‌దిలేసి తా‌నూ, త‌న పిల్ల‌లతో వేరుకాపురం పెట్టాల‌ని రోహిత్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది అత‌ని వ‌దిన.

ఇదే క్రమంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రోహిత్‌ ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. అనంత‌రం పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని శ‌వాన్ని పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించారు. అయితే, హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో బాధితురాలి కూతురు బంధువుల ఇంటికి వెళ్ల‌గా, కొడుకు ఇంటి బ‌య‌టే ఆడుకుంటున్నాడ‌ని నిందితుడు రోహిత్ చెప్పిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామని పోలీసులు తెలిపారు.