5

జీహెచ్ఎంసీలో ‘గంధపు‘ దొంగలు.. ఏకంగా ఇందిరాపార్కులోనే..!

గంధపు చెట్ల స్మగర్లు, దొంగలు ఎక్కడో తమిళనాడులోనో.. కనీసం చిత్తూరు అడవుల్లోనో వుంటారనుకుంటే ఏకంగా హైదరాబాద్ నగరంలో తేలారు. ఏకంగా గంధపు చెట్లను నరికి.. గంధపు చెక్కల్ని పట్టుకుపోతున్నారు.

జీహెచ్ఎంసీలో ‘గంధపు‘ దొంగలు.. ఏకంగా ఇందిరాపార్కులోనే..!
Follow us

|

Updated on: Nov 11, 2020 | 4:57 PM

Sandalwood smugglers in GHMC area: గంధపు చెట్ల స్మగర్లు, దొంగలు ఎక్కడో తమిళనాడులోనో.. కనీసం చిత్తూరు అడవుల్లోనో వుంటారనుకుంటే ఏకంగా హైదరాబాద్ నగరంలో తేలారు. ఏకంగా గంధపు చెట్లను నరికి.. గంధపు చెక్కల్ని పట్టుకుపోతున్నారు. సిటీ నడిబొడ్డున వున్న ఇందిరాపార్కులోనే గంధపు చెట్లను నిట్టనిలువునా నరికేస్తున్నారు. సిటీ సెంటర్ పార్కు నుంచి 13 గంధపు చెట్లను నరికి చక్కగా పట్టుకుపోయారు. రాత్రి పూట జరిగిన ఈ తంతును చూసి అధికారులే కాదు పోలీసులు కూడా నివ్వెర పోయారు.

ట్యాంక్ బండ్ కింద వుండే ఇందిరాపార్క్ ఒకప్పుడు సినీ షూటింగులకు, పర్యాటకులకు కేంద్రంగా వుండేది. నగరం నలుమూలలా విస్తరించిన తర్వాత ఇందిరాపార్కుకు ఆదరణ తగ్గుతూ వస్తోంది. అయితేనేం.. స్థానికంగా వుండే వారు… కొందరు బయటి పర్యాటకులు ఇందిరా పార్కుకు వస్తూనే వుంటారు. అయితే.. సాయంత్రం అయ్యిందంటే చాలు పార్కులో ఎవరూ వుండరు. ఇదే అదనుగా గంధపు చెట్లను నరికి చెక్కల్ని తీసుకెళ్ళారు దొంగలు. ఎంతో కాలంగా ఇందిరాపార్కులో పెరుగుతున్న 13 గంధపు చెట్లను నరికేశారు. వాటి విలువ లక్షా 60 వేల దాకా వుంటుందని ప్రాథమికంగా అంఛనా వేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.

ఈ తంతు ఇంటి దొంగల పనిగా భావిస్తున్నారు బల్దియా ఉన్నతాధికారులు. రాత్రి సమయాల్లో వాటిని కట్ చేసి తీసుకోవడంతో తెలిసిన వారి పనిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఏళ్ల తరబడి ఇందిరా పార్క్‌లో పెరిగిన గంధపు చెట్లను రాత్రికి రాత్రి కట్ చేసి.. పట్టుకెళ్ళడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమీప ప్రాంతాల్లో వున్న సీసీ కెమెరాల ఫుటేజీ దర్యాప్తులో కీలకం కానున్నది.

ALSO READ: ఏపీ ఆరోగ్య శ్రీలో ఇక ఆ వ్యాధి కూడా..!

ALSO READ: యుపీ, బెంగాల్‌పై ఓవైసీ నజర్.. యాక్షన్ ప్లాన్ ఇదే!

ALSO READ: సాదాబైనామాల క్రమబద్దీకరణపై హైకోర్టు స్టే