బహ్రెయిన్ రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా కన్నుమూత
దశాబ్దాలుగా బహ్రెయిన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆ దేశ రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బుధవారం కన్నుమూశారు.
దశాబ్దాలుగా బహ్రెయిన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆ దేశ రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బుధవారం కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఖలీఫా అమెరికాలోని మయో క్లినిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. అయితే, ఆయన మృతికి గల కారణాలను మాత్రం రాయల్ ప్యాలెస్ వెల్లడించలేదు. ఖలీఫా మృతితో బహ్రెయిన్ ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
1935లో జన్మించిన ఖలీఫా 1970 నుంచి ఆ దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రపంచంలోనే సుదీర్ఘకాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన నేతల్లో ఖలీఫా ఒకరు. 2011లో ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఖలీఫాను తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అయినప్పటికీ వాటన్నింటి నుంచి గట్టెక్కిన ఖలీఫా దశాబ్దాలుగా ప్రధానిగా కొనసాగారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన అధికారాలను కొంత తగ్గిస్తూ రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేశారు. అనంతరం గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అమెరికాలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షిణించడంతో బుధవారం మృతి చెందినట్లు ప్రకటించారు.