పెళ్లికి బోలెడ్ ప్లాన్లు ఉన్నాయి.. కానీ డేట్ ఫిక్స్ చేయలే: న్యూజిలాండ్ ప్రధాని
పెళ్లికి బోలెడు ప్రణాళికలు ఉన్నాయని, కానీ తేదీ మాత్రం ఫిక్స్ చేయలేదని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిందా ఆర్డెర్న్ అన్నారు

New Zealand PM Jacinda Ardern: పెళ్లికి బోలెడు ప్రణాళికలు ఉన్నాయని, కానీ తేదీ మాత్రం ఫిక్స్ చేయలేదని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిందా ఆర్డెర్న్ అన్నారు. అందులోని కొన్ని ప్రణాళికలను ఇంట్లో వారితో, కుటుంబ సభ్యులతో పంచుకోవాలని ఆమె తెలిపారు. కాగా జెసిందా గత కొన్నేళ్లుగా న్యూజిలాండ్ టెలివిజన్ హోస్ట్ క్లార్కే గేఫోర్డ్‌తో సహజీవనం చేస్తున్నారు. వారిద్దరికి రెండు సంవత్సరాల కుమార్తె కూడా ఉంది. ఇక గత నెల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జెసిందా.. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టార. ఇక ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను కట్టడి చేసే విషయంలో జెసిందాపై పలువురు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
Read More:
డ్రగ్స్ కేసు.. ఎన్సీబీ విచారణకు హాజరైన నాగ్ హీరోయిన్
‘జీవోటీ’ నా పాత్ర ముగిశాక అప్పుల్లో పడ్డా, పస్తులతో గడిపాం: ఆక్వామెన్