మరోసారి అంతరిక్షానికి మనుషులను తీసుకెళుతోన్న స్పేస్‌ఎక్స్‌

మరోసారి అంతరిక్షానికి మనుషులను తీసుకెళుతోన్న స్పేస్‌ఎక్స్‌

గత మే నెలలో ఇద్దరు వ్యోమగాములను ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు సురక్షితంగా చేర్చి.. మళ్లీ అంతే సురక్షితంగా భూమ్మీదకు తీసుకొచ్చిన స్పేస్‌ ఎక్స్‌ ఇప్పుడు మరోసారి అంతరిక్ష ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. ఈసారి నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపబోతున్నది.. నాసాకు చెందిన ముగ్గురు ఆస్ట్రోనట్‌లు, జపాన్‌కు చెందిన ఒక ఆస్ట్రోనట్‌ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగానికి నాసా కూడా అనుమతి ఇచ్చేసింది.. శనివారం రాత్రి 7.49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇంటర్నేషనల్‌ […]

Balu

|

Nov 11, 2020 | 3:48 PM

గత మే నెలలో ఇద్దరు వ్యోమగాములను ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు సురక్షితంగా చేర్చి.. మళ్లీ అంతే సురక్షితంగా భూమ్మీదకు తీసుకొచ్చిన స్పేస్‌ ఎక్స్‌ ఇప్పుడు మరోసారి అంతరిక్ష ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. ఈసారి నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపబోతున్నది.. నాసాకు చెందిన ముగ్గురు ఆస్ట్రోనట్‌లు, జపాన్‌కు చెందిన ఒక ఆస్ట్రోనట్‌ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగానికి నాసా కూడా అనుమతి ఇచ్చేసింది.. శనివారం రాత్రి 7.49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు రాకెట్‌ బయలుదేరుతుంది.. అమెరికాకు చెందిన మైకెల్‌ హాప్కిన్స్‌, విక్టర్‌ గ్లోవర్‌, శనాన్‌ వాకర్‌లతో పాటు జపాన్‌కు చెందిన సోచి నగూచీ ఈ మిషన్‌లో పాలుపంచుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో కూడా మరో మానవసహిత అంతరిక్ష ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని స్పేస్‌ఎక్స్‌ స్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ తెలిపాడు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu