ముంబై ఇండియన్స్‌కు గూగుల్ అదిరిపోయే సర్‌ప్రైజ్.. వావ్ అనాల్సిందే.!

ముంబై జట్టు విజయంపై క్రికెట్ దిగ్గజాలు స్పందించారు. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ముంబై ఇండియన్స్ టీంకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ముంబై ఇండియన్స్‌కు గూగుల్ అదిరిపోయే సర్‌ప్రైజ్.. వావ్ అనాల్సిందే.!
Follow us

|

Updated on: Nov 11, 2020 | 4:29 PM

ఐపీఎల్ 2020 ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయాన్ని సాధించి ఐదోసారి ఐపీఎల్ విజేతగా అవతరించింది. ఇక ముంబై జట్టు విజయంపై క్రికెట్ దిగ్గజాలు స్పందించారు. అటు సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ముంబై ఇండియన్స్ టీంకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.

గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి Mumbai Indians అని టైప్ చేస్తే.. తారాజువ్వలు స్క్రీన్‌పై వెలిగేలా క్రియేట్ చేసింది. అలాగే ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ స్కోర్ల వివరాలతో పాటు.. ముంబై ఇండియన్స్ టీం వివరాలు పూర్తిగా కవర్ అయ్యేలా పేజ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ఫ్యాన్స్‌ నుంచి మంచి స్పందన లభిస్తోంది. లేట్ ఎందుకు.. మీరు కూడా ఆ మేజిక్‌ను చూడండి..!

Also Read:

మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ