Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బైపోల్ విజయం నీదే’ ! భార్యపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ అభిమానం

మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో 28 సీట్లకు గాను బీజేపీ 19 స్థానాలను గెలుచుకోవడంతో తన  ఆనందాన్ని  రాష్ట్ర సీఎం, ఈ పార్టీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తన భార్య సాధనతో పంచుకున్నారు. ఈ అఖండ విజయానికిఆమె తనకు ఇచ్చిన శక్తి, ప్రేరణే కారణమని  ట్వీట్ చేశారు. నా జీవితంలో సాధన నాకు అన్నివేళలా అండగా ఉంటూ వచ్చింది.. నా శక్తికి, ప్రేరణకు మూలం నువ్వే’ అన్నారు. ఆమె తనతో ఉంటే ఎప్పుడూ తనదే విజయమన్నారు. ఈ బైపోల్స్ […]

ఈ బైపోల్ విజయం నీదే' ! భార్యపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ అభిమానం
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 11, 2020 | 4:11 PM

మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో 28 సీట్లకు గాను బీజేపీ 19 స్థానాలను గెలుచుకోవడంతో తన  ఆనందాన్ని  రాష్ట్ర సీఎం, ఈ పార్టీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తన భార్య సాధనతో పంచుకున్నారు. ఈ అఖండ విజయానికిఆమె తనకు ఇచ్చిన శక్తి, ప్రేరణే కారణమని  ట్వీట్ చేశారు. నా జీవితంలో సాధన నాకు అన్నివేళలా అండగా ఉంటూ వచ్చింది.. నా శక్తికి, ప్రేరణకు మూలం నువ్వే’ అన్నారు. ఆమె తనతో ఉంటే ఎప్పుడూ తనదే విజయమన్నారు. ఈ బైపోల్స్ లో బీజేపీ విజయానికి  తన భర్తను  సాధన అభినందిస్తూ ట్వీట్ చేయడమే గాక ఆయనకు స్వీట్  తినిపిస్తున్న ఫోటోను పోస్ట్ చేయడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ పొంగిపోయి ఇలా స్పందించారు. అటు-మధ్యప్రదేశ్ బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లను మాత్రం గెలుచుకోగలిగింది.