ఆన్‌లైన్‌ ఛానల్స్‌పై కేంద్రం నిఘా.. ఇకపై అనుమతి తప్పనిసరి..

ఆన్‌లైన్‌ ఛానల్స్‌పై కేంద్రం నిఘా.. ఇకపై అనుమతి తప్పనిసరి..

ఓటీటీలలో పెరుగుతోన్న అశ్లీలతను కట్టడి చేసేందుకు మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ ఛానల్స్, ఓటీటీ కంటెంట్‌లు, ఆన్‌లైన్‌ ఫిలిమ్స్..

Ravi Kiran

|

Nov 11, 2020 | 4:24 PM

ఓటీటీలలో పెరుగుతోన్న అశ్లీలతను కట్టడి చేసేందుకు మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ ఛానల్స్, ఓటీటీ కంటెంట్‌లు, ఆన్‌లైన్‌ ఫిలిమ్స్, వీడియో ప్రోగ్రామ్స్, డిజిటల్ న్యూస్, కరెంట్ అఫైర్స్ లాంటి వాటన్నిటినీ కేంద్ర సమాచార శాఖ పరిధిలోకి తీసుకొస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. దీనితో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి టాప్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఇకపై కేంద్రం నియంత్రణలో ఉండనున్నాయి. ప్రస్తుతం, డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించే చట్టం లేదా స్వయం ప్రతిపత్త అధికారిక సంస్థ లేదన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ఆదేశాలపై ప్రాధాన్యత సంతరించుకుంది. (Government Regulation On OTT Platforms)

కాగా, గతంలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కు కేంద్రం పలు సూచనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ స్టాండర్డ్ అథారిటీ తరహాలో ఓటీటీలు సైతం స్వీయ-నియంత్రణ సంస్థతో రావాలని కోరింది. ఈ క్రమంలోనే జనవరి 2019న దాదాపు ఎనిమిది వీడియో స్ట్రీమింగ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు స్వీయ-నియంత్రణ కోడ్‌కు సంబంధించిన మార్గదర్శకాలపై సూత్రప్రాయంగా సంతకం చేశాయి. అయితే ఆ OTTలు అవలంబించిన కోడ్‌పై పలు అభ్యంతరాలు ఉండటంతో దానిని కేంద్రం నిరాకరించింది. ఇక ప్రస్తుతం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రింట్ మీడియాను నియంత్రిస్తుండగా.. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (NBA) న్యూస్ ఛానళ్లను మానిటరింగ్ చేస్తోంది, అలాగే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటనలను.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాలను పర్యవేక్షిస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu