ఏపీ ఆరోగ్య శ్రీలో ఇక ఆ వ్యాధి కూడా..!
ఏపీలో ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే వ్యాధులను మరోసారి సవరించారు. బోన్ మ్యారో చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Bone-marrow disease included in Arogyasri: ఏపీలో ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే వ్యాధులను మరోసారి సవరించారు. బోన్ మ్యారో చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి బోన్ మ్యారో చికిత్సను కూడా చేరుస్తూ రాష్టర్ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులిచ్చింది.
ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంపానల్ అయిన ప్రతీ ఆస్పత్రిలోనూ ఈ వ్యాధికి చికిత్స అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లోని ఎంపానల్డ్ ఆస్పత్రుల్లోనూ ఈ వ్యాధికి చికిత్స అందించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. 2020 నవంబరు 10వతేదీ నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ALSO READ: యుపీ, బెంగాల్‌పై ఓవైసీ నజర్.. యాక్షన్ ప్లాన్ ఇదే!