రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి ‘సుప్రీం’ బెయిల్

రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంటీరియర్ డిజైనర్ ను, అయన తల్లిని ఆత్మహత్యకు  ప్రేరేపించారన్న అభియోగాలపై ముంబై పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను బాంబేహైకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే. ఆ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అర్నాబ్ సుప్రీంకోర్టుకెక్కారు. తనపై పెట్టిన రెండేళ్ల నాటి కేసు అక్రమమని ఆయన ఆరోపించారు.  కాగా-మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ […]

రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి 'సుప్రీం' బెయిల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 11, 2020 | 6:04 PM

రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంటీరియర్ డిజైనర్ ను, అయన తల్లిని ఆత్మహత్యకు  ప్రేరేపించారన్న అభియోగాలపై ముంబై పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను బాంబేహైకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే. ఆ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అర్నాబ్ సుప్రీంకోర్టుకెక్కారు. తనపై పెట్టిన రెండేళ్ల నాటి కేసు అక్రమమని ఆయన ఆరోపించారు.  కాగా-మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆదేశంపై తన క్లయింటును అరెస్టు చేశారని, అర్నాబ్ కు బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన  మునిగిపోయేదేమీ లేదని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టులో వాదించారు.

Latest Articles