US vs China: ఏమాత్రం తగ్గేదేలే.. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం.. 104 శాతానికి చేరిన సుంకాలు
ముందుగా చెప్పినట్లుగా అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరాయి. ఇవి ఏప్రిల్ 9 అంటే ఈరోజు నుంచి అమలులోకి రానున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు

ట్రంప్ ఏమాత్రం తగ్గట్లేదు. సుంకాల విషయంలో తన వైఖరిని మార్చుకునేదే లేదంటున్నారు. చైనాపై మరో 50శాతం ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు. దీంతో అమెరికా , చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. ముందుగా చెప్పినట్లుగా అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరాయి. ఇవి ఏప్రిల్ 9 అంటే ఈరోజు నుంచి అమలులోకి రానున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు.
ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్.. ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకుంటే అదనంగా మరో 50 శాతం ప్రతీకార సుంకం విధిస్తానన్నారు. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్లుగానే చేశారు. అదనంగా మరో 50 శాతం సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది.
అయితే.. ట్రంప్ నిర్ణయంపై చైనా ఇంకా స్పందించలేదు. పలు దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తూ తమ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయని ట్రంప్ పలు సార్లు ఆరోపించారు. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాలు విధిస్తూ వచ్చింది. ఇటీవల పెంచిన సుంకాలతో కలిసి చైనాపై మొత్తం సుంకాలు 54 శాతానికి చేరుకున్నాయి.
తాజాగా మరో 50 శాతం పన్నులు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇక ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా స్టాక్ మార్కట్లు మళ్లీ కుప్పకూలాయి. అయితే ముందు భారీ లాభాల్లో కనిపించిన అమెరికా మార్కట్లు.. చివరకు 2 నుంచి మూడున్నర శాతం నష్టాలను చవిచూశాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..