AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: ఖర్చులు కంట్రోల్‌‌లో లేకపోతే కష్టమే! ఈ రాశుల వారు జూన్ వరకు జాగ్రత్త

కొన్ని రాశుల వారికి ఖర్చుల విషయంలో అదుపు తక్కువగా ఉంటుంది. ఆదాయం ఎంత ఉన్నా ఖర్చు మాత్రం ఎక్కువగానే ఉంటుంది. మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారు డబ్బు సేవ్ చేయడంలో వెనుకబడుతూ, ఖర్చు పెట్టడంలో ముందుంటారు.

Money Astrology: ఖర్చులు కంట్రోల్‌‌లో లేకపోతే కష్టమే! ఈ రాశుల వారు జూన్ వరకు జాగ్రత్త
Money Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 04, 2026 | 3:19 PM

Share

కొన్ని రాశుల వారికి ఖర్చుల విషయంలో జాగ్రత్త తక్కువ. ఆదాయం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఖర్చు మాత్రం ఉన్నత స్థాయిలోనే ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది కూడా ఒక రాజయోగ లక్షణమే అయినప్పటికీ, జూన్ ప్రారంభం వరకు వీరు వ్యయం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డబ్బును దాచుకోకపోవడమన్నది మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారి సహజ లక్షణమే కాక ఒక బలహీనత కూడా. ఖర్చు విషయంలో ఈ రాశుల వారు అందరికంటే ముందుంటారు. ఖర్చు పెట్టడంలో వెనుకా ముందూ చూడరు.

  1. మేషం: డాబూ, దర్పం ఈ రాశివారి సహజ లక్షణం. ఇతరుల ముందు దర్జాగా కనబడే ప్రయత్నం చేస్తుంటారు. ఫలితంగా వీరికి చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం దాన ధర్మాలకు, ఉచిత సహాయాలకు వృథా అయ్యే అవకాశం ఉంది. ఆదాయంలో కొంత భాగాన్ని శుభకార్యాలకు, ఆధ్యాత్మిక వ్యవహారాలకు, ఆలయాలకు ఖర్చు చేసే అవకాశం ఉన్నా, అనవసర ప్రయాణాల వల్ల కూడా బాగా ఖర్చయ్యే సూచనలున్నాయి.
  2. కర్కాటకం: పేదలు, బలహీనురు, సమస్యల్లో ఉన్నవారిని చూస్తే కరిగిపోవడం ఈ రాశివారి సహజ లక్షణం. ఆదాయం కోసం బాగా కష్టపడడం వీరిలో ఎక్కువగా ఉంటుంది కానీ, కష్టార్జితంలో ఎక్కువ భాగం ఏదో విధంగా వృథా అవుతుంటుంది. సున్నిత మనస్కులు కావడం వల్ల వెనుకా ముందూ చూడకుండా దానధర్మాలు చేస్తుంటారు. అప్పు ఇచ్చినా రాబట్టుకునే మనస్తత్వం ఉండదు. మోసపోవడం, నష్టపోవడం జరుగుతుంటుంది. ఉచిత సహాయాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
  3. సింహం: ప్రాధాన్యం చూపించుకోవడానికి, తనలోని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించుకోవడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. వ్యక్తిగత సుఖ సంతోషాలతో పాటు, బంధుమిత్రుల దగ్గర తన స్థాయిని చూపించుకోవడం మీద కూడా ఖర్చు బాగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల నిర్వ హణకు వీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, ఖర్చు మీద వీరికి అదుపు ఉండదు. ప్రేమ భాగస్వామి మీద కూడా ఖర్చు బాగా వృద్ధి చెందుతుంది.
  4. తుల: ఈ రాశివారిలో దయా దాక్షిణ్యాలు ఎక్కువగా ఉంటాయి. దానధర్మాలు, ఉచిత సహాయాలు కాస్తంత అధికంగా ఉంటాయి. తనకు నమ్మకస్తులు, విధేయుల మీద వీరు మితిమీరి ఖర్చు పెడుతుంటారు. పొగడ్తలకు పొంగిపోతారు. అందువల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం మోసాలు, నష్టాల పాలవుతుంటుంది. షాపింగ్ మీదా, సుఖ సంతోషాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. జల్సాలు, విందులు, వినోదాలతో పాటు దానధర్మాల కోసం ఆదాయ ప్రయత్నాలు సాగిస్తుంటారు.
  5. ధనుస్సు: ఈ రాశికి సమాజ సేవ మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది. పేదలు, నిస్సహాయులు, నిర్ధనుల కోసం వీరు పాటుపడుతుంటారు. తనను గౌరవమర్యాదలతో చూసేవారి మీద వీరికి అభిమానం ఎక్కువ. బహిరంగ సహాయాలే కాక, రహస్య లేదా గుప్త సహాయాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కో సారి సామాజిక హోదా కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఆహారం, దుస్తులు, ఆభరణాల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఎవరికైనా అప్పు ఇచ్చినా వసూలు చేసుకోలేకపోతారు.
  6. మీనం: ఈ రాశివారిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. కర్మఫలం మీదా, దేవుడి అనుగ్రహం మీదా, అదృష్టం మీదా ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఆదాయంలోనూ, అదనపు ఆదాయం లోనూ ఎక్కువ భాగం ఆధ్మాత్మిక కార్యకలాపాలకు ఖర్చయిపోతుంటాయి. వీరికి సొంత ఖర్చులు తక్కువ, సామాజిక ఖర్చులు ఎక్కువ. సేవా కార్యక్రమాల మీద ఎక్కువగా ఖర్చవుతుంటుంది. తరచూ ఆర్థికంగా నష్టపోతుంటారు. డబ్బు తీసుకున్నవారు తిరిగి ఇచ్చే అవకాశం ఉండకపో వచ్చు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
ఖర్చులు కంట్రోల్‌‌లో లేకపోతే కష్టమే! ఈ రాశుల వారు జాగ్రత్త..
ఖర్చులు కంట్రోల్‌‌లో లేకపోతే కష్టమే! ఈ రాశుల వారు జాగ్రత్త..
విజయ్ మాస్టర్ ఎంట్రీ.. బెంగాల్‌లో బీజేపీ స్ట్రాటజీ..
విజయ్ మాస్టర్ ఎంట్రీ.. బెంగాల్‌లో బీజేపీ స్ట్రాటజీ..
బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ కావాలా?హోల్‌సేల్ ధరలకే నచ్చిన బహుమతులు
బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ కావాలా?హోల్‌సేల్ ధరలకే నచ్చిన బహుమతులు
ఇకపై 'గర్ల్‌ఫ్రెండ్స్'కు నో ఎంట్రీ.. షాకిచ్చిన బీసీసీఐ..!
ఇకపై 'గర్ల్‌ఫ్రెండ్స్'కు నో ఎంట్రీ.. షాకిచ్చిన బీసీసీఐ..!
మీ PPF డబ్బులు జమ చేయడం మర్చిపోయారా? డియాక్టివేట్‌ అయ్యిందా?
మీ PPF డబ్బులు జమ చేయడం మర్చిపోయారా? డియాక్టివేట్‌ అయ్యిందా?
మీతి బూందీ చేసి హనుమాన్‎కు నైవేద్యం పెడితే మీ జీవితం మారిపోతోంది
మీతి బూందీ చేసి హనుమాన్‎కు నైవేద్యం పెడితే మీ జీవితం మారిపోతోంది
మామిడి పండు రుచితో రవ్వ లడ్డును ఇలా కొత్తగా ట్రై చేయండి! ఆ మజానే
మామిడి పండు రుచితో రవ్వ లడ్డును ఇలా కొత్తగా ట్రై చేయండి! ఆ మజానే
విజయ్ దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం అవుతారా? ఆయన ఎంతో తెలిస్తే..
విజయ్ దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం అవుతారా? ఆయన ఎంతో తెలిస్తే..
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. మరీ సీఎం అయ్యేది ఎవరు..?
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. మరీ సీఎం అయ్యేది ఎవరు..?
టీవికే ఆధిక్యంతో ఏపీలో విజయ్ అభిమానుల సంబరాలు
టీవికే ఆధిక్యంతో ఏపీలో విజయ్ అభిమానుల సంబరాలు