AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఆ రాశి వారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సుఖాంతం.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

వార ఫలాలు (మార్చి 10 నుంచి మార్చి 16, 2024 వరకు): శుభ గ్రహాల అనుగ్రహం కారణంగా మేష రాశి వారికి ఈ వారమంతా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి బుధ, శుక్రుల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితికి ఎటువంటి లోటూ ఉండదు. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Weekly Horoscope: ఆ రాశి వారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సుఖాంతం.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
Weekly Horoscope 10 March - 16 March 2024
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 10, 2024 | 5:01 AM

Share

వార ఫలాలు (మార్చి 10 నుంచి మార్చి 16, 2024 వరకు): శుభ గ్రహాల అనుగ్రహం కారణంగా మేష రాశి వారికి ఈ వారమంతా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి బుధ, శుక్రుల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితికి ఎటువంటి లోటూ ఉండదు. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాల అనుగ్రహం కారణంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. తలపెట్టిన ప్రతి పనీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతుంది. ఆస్తి పాస్తుల విలువ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఆశించిన దాని కంటే ఆదా యం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వినడం, వారు వృద్ధిలోకి రావడం వంటివి జరుగుతాయి. స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సతీమణి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపో తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

బుధ, శుక్రుల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితికి ఎటువంటి లోటూ ఉండదు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఒక శుభవార్త వింటారు. ఆస్తిపరంగా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుం టుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపో తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గురు, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం నిల కడగా ఉంటుంది కానీ, విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. దైవకార్యా లకు ఆర్థికంగా సహాయపడతారు. స్నేహితుల సహాయంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సుఖాంతం అయ్యే అవకాశముంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాదిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను, ఆర్థిక సమస్యలను చాలావరకు చక్క బెడతారు. కుటుంబపరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరి స్థితిని మెరుగుపరచుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబ డులకు తగిన లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం పరవాలేదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గురు బలం బాగా ఉన్న కారణంగా అనేక విషయాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపో తాయి. సమయం బాగా అనుకూలంగా ఉంది. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యత లను మోయవలసి వస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలున్నప్పటికీ, చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది. కుటుంబ సభ్యులతో సర దాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మొత్తం మీద ఆరోగ్యానికి, ఆదాయానికి లోటేమీ ఉండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.

కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2)

శని, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొద్దిగా వ్యయ ప్రయాసలున్నా ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు చోటు చేసుకునే అవకాశముంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యో గంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ఖర్చు లకు కళ్లెం వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయంగా నిలబడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవు తాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఇంటా బయటా బాధ్యతలు పెరిగి, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే, వ్యక్తిగతంగా కొన్ని శుభ పరిణామాలకు కూడా అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి, దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవ హారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సతీమణికి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలో అపార్థాలు తలెత్తుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుటుంబపరంగా చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకుపోతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు. ఇతరత్రా వారమంతా అనుకూలంగానే సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆదాయం పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కష్టనష్టాలు బాగా తగ్గి సుఖ సంతోషాలు ఎక్కు వగా అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా మారుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పెళ్లి సంబంధం విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు పొందు తారు. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వారమంతా ఒక మోస్తరుగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. పట్టుదలగా ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒక కార్యక్రమంలో ఇష్టమైన వారిని కలుసుకుంటారు. దూర ప్రయాణాలను చివరి క్షణంలో వాయిదా వేసుకునే అవ కాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదా యానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఉద్యోగం మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. సహోద్యోగులతో చిన్నా చితకా సమ స్యలను అధిగమిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్, షేర్లకు దూరంగా ఉండడం మంచిది. సతీమణి నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ధనపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి.

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్