Vipreet Raj Yoga: కీలక స్థానాల్లో గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి విపరీత రాజయోగం పట్టనుంది..!
ఆరు రాశుల వారికి ఈ నెలాఖరు వరకు విపరీత రాజయోగం పట్టబోతోంది. విపరీత రాజయోగమంటే, 6, 8, 12 రాశుల అధిపతులు వారి వారి రాశుల్లో ఉండడం లేదా 6వ స్థానం అధిపతి 8, 12 రాశుల్లోనూ, 8వ స్థానం అధిపతి 6, 12 రాశుల్లోనూ, 12వ స్థానం అధిపతి 6, 8 స్థానాల్లోనూ ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది.

ఆరు రాశుల వారికి ఈ నెలాఖరు వరకు విపరీత రాజయోగం పట్టబోతోంది. విపరీత రాజయోగమంటే, 6, 8, 12 రాశుల అధిపతులు వారి వారి రాశుల్లో ఉండడం లేదా 6వ స్థానం అధిపతి 8, 12 రాశుల్లోనూ, 8వ స్థానం అధిపతి 6, 12 రాశుల్లోనూ, 12వ స్థానం అధిపతి 6, 8 స్థానాల్లోనూ ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. విపరీత రాజయోగం పడుతున్న రాశులుః మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల. ఈ రాశులవారికి ధన యోగం, అధికార యోగం పట్టడంతో పాటు ఏం చేసినా చెలామణి కావడం, మాటకు, చేతకు విలువ పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశులవారి సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది.
- మేషం: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన బుధుడు ప్రస్తుతం 12వ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం ఏర్పడింది. దీనివల్ల ఏమాత్రం ఊహించని విధంగా రాజయోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. పదోన్నతులు కలుగుతాయి. అనేక మార్గాలలో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. దీర్గకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశ మనం లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయి, జీవితం అనూహ్యంగా మారిపోతుంది.
- వృషభం: ఈ రాశివారికి 8వ స్థానాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆస్తి వివాదం అను కూ లంగా పరిష్కారం అవుతుంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరగడం, ఆస్తులు కొనడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
- మిథునం: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం పట్టింది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా పదోన్నతికి అవకాశం ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశముంటుంది. అన్ని విధాలు గానూ ప్రాభవం పెరుగుతుంది. ముఖ్యంగా అనేక మార్గాల్లో రాబడి పెరిగి, ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై, మనశ్శాంతి కలుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి అష్టమాధిపతి శని అష్టమ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల విపరీత రాజ యోగం ఏర్పడింది. ఫలితంగా అనేక రంగాల్లో, అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. మాటకు, చేతకు ఎదురుండదు. ప్రముఖులతో కలిసి మెలిసి తిరగడం, గౌరవ మర్యాదలకు లోటు లేకపోవడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి రావడం, ఊహించని విధంగా సంపద పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది.
- కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి శని ఆరవ స్థానంలోనే ఉండడం వల్ల విపరీత రాజయోగం కలు గుతోంది. దీనివల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అంది వస్తాయి. విదేశాల నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయి, సంపన్న కుటుంబంలో సంబంధం ఖాయమవుతుంది. అనేక విధాలుగా సంపద వృద్ది చెందుతుంది. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మాట చెల్లుబాటవుతుంది.
- తుల: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో సంచరిస్తున్నందువల్ల విపరీత రాజ యోగం ఏర్పడింది. అనూహ్యంగా ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ప్రధానమైన ఆర్థిక అవసరాలన్నీ తీరిపోతాయి. గృహ, వాహన యోగాలు అనుభవా నికి వస్తాయి. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు సంభవిస్తాయి.



