Weekly Horoscope: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. మే 5 నుంచి 11 వరకు వారఫలాలు..
వార ఫలాలు (మే 5 నుంచి 11 2024 వరకు): మేషం రాశి వారికి శుభ గ్రహాల సంచారం ధనపరంగా బాగా అనుకూలంగా ఉంది. వృషభం రాశివారికి ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సత్ఫలితాలనిస్తుంది. మిథునం రాశివారికి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినంత వరకూ సమయం బాగా అనుకూలంగా ఉంది. కాగా.. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు మే 5 నుంచి 11 వరకు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
వార ఫలాలు (మే 5 నుంచి 11 2024 వరకు): మేషం రాశి వారికి శుభ గ్రహాల సంచారం ధనపరంగా బాగా అనుకూలంగా ఉంది. వృషభం రాశివారికి ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సత్ఫలితాలనిస్తుంది. మిథునం రాశివారికి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినంత వరకూ సమయం బాగా అనుకూలంగా ఉంది. కాగా.. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు మే 5 నుంచి 11 వరకు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ గ్రహాల సంచారం ధనపరంగా బాగా అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ అనుకూల సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం కూడా చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. చేపట్టిన వ్యవ హారాలు వేగంగా పూర్తవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతో షాలతో సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సత్ఫలితాలనిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీరు ఈ వారం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఊహించని శుభ ఫలితాలనిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వ్యాపారంలో పోటీదార్ల బెడద చాలావరకు తగ్గుతుంది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. వృత్తి జీవితంలో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రాభవం బాగా పెరుగుతుంది. మీ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. విదేశీ ప్రయాణ సూచనలు న్నాయి. రాజీమార్గంలో ఆస్తి వివాదాన్ని పరిష్కారం చేసుకుంటారు. పిల్లలకు ఉన్నత విద్యావకా శాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినంత వరకూ సమయం బాగా అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో అదనపు రాబడికి అవకాశముంది. మిత్రుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు నష్టాల్లోంచి బయటపడి లాభాల బాట పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందివస్తాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వ్యక్తిగత సమస్యల కారణంగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. లాభ స్థానంలో గురువు సంచారం కారణంగా కొన్ని ముఖ్యమైన వివాదాలు, సమస్యలు పరిష్కా రమవుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ రుణాలు మంజూరవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి బాగా తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. రావల సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. అనారోగ్యం నుంచి ఉపశ మనం లభిస్తుంది. పిల్లలకు కొత్త విద్యావకాశాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా ముందుకు సాగుతాయి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): భాగ్య, ఉద్యోగ స్థానాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశముంది. పెండింగు పనులను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశాలు అంది వస్తాయి. పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): శుభ గ్రహాల బలం ఈ వారం కాస్తంత ఎక్కువగానే ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. అయితే, ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. వృథా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఇంటా బయటా అదనపు బాధ్యతలు మీద పడతాయి. ముఖ్యమైన పనులు చాలావరకు పూర్త వుతాయి. బంధు మిత్రుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మీ నుంచి ఆర్థిక సహాయం ఆశించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభా నికి అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశముంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఒకటి రెండు శుభ వార్తలందుతాయి. ముఖ్యమైన పనులన్నీ సానుకూలపడతాయి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుక్ర, గురువులు అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. కొందరు మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడతాయి. ఆస్తి వివాదం విషయంలో పట్టు విడుపులతో వ్యవహరించడం మంచిది. అనుకోకుండా ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవ హారాల్లో పెద్దల నుంచి సహాయ సహకారాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. రావలసిన డబ్బు, బాకీలు, బకా యిలు చేతికి అందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త కూడా వింటారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ప్రధానమైన శుభ గ్రహమైన గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితికి సంబంధించి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బాగా డబ్బు కలిసి వస్తుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల్లో సానుకూల మార్పులు జరిగే అవకాశముంది. అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ప్రతి వ్యవహారం లోనూ సొంత ఆలోచనలు మంచివి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి బాటలో పడ తాయి. పిల్లలు కొత్త శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపో తాయి.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కొద్దిగా ఆలస్యంగానే అయినా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యల చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. బంధువు లతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఏలిన్నాటి శని ప్రభావం కారణంగా ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. సోదరులతో ఒకటి రెండు కుటుంబ వివాదాలు పరిష్కారమయ్యే అవకాశముంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్య త్తులో ఉపయోగపడతాయి. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. వృత్తి జీవితం లాభ సాటిగా సాగిపోతుంది. ఉద్యోగ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలను కొద్దిపాటి శ్రమతో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఆశించిన స్పందన లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహరాలు అనుకూ లిస్తాయి.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఆర్థిక సమస్యలను చాలావరకు పరిష్కరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేపడతారు. ఆస్తి వివాదం మరింతగా జటిలమవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిదానంగా లాభాల బాట పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. కొద్దిగా శ్రమ, తిప్పట ఉండే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. శుక్ర, రవుల అను కూలత కారణంగా సర్వత్రా ప్రాభవం పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ప్రతి ప్రయత్నమూ నిరాటంకంగా సాగిపోతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొనసాగుతుంది. వ్యాపారాలను విస్తరించడానికి ఇది సమయం కాదు. ఉద్యోగాలలో అధికారులు బాగా సాను కూ లంగా వ్యవహరిస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొం టుంది. కష్టనష్టాల నుంచి చాలవరకు బయటపడతారు. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే సూచ నలున్నాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ పరిస్థితులు ప్రశాం తంగా ఉంలాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.