Horoscope Today: ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు.. శనివారం రాశిఫలాలు ఇలా..

వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు, శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహ కాలు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆటం కాలున్నా ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు..

Horoscope Today: ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు.. శనివారం రాశిఫలాలు ఇలా..
Horoscope Today
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: May 04, 2024 | 6:57 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. అను కోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల సాయంతో ముఖ్య మైన వ్యవహారాలు పూర్తవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించిన ఆఫర్లు అందుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత వల్ల విశ్రాంతి తగ్గుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభి స్తాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మిత్రులు కొందరు తప్పుదోవ పట్టించే అవకాశ ముంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపో తుంది. ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగు పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఇతరు లకు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. కొందరు ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధమైన శుభవార్తలు అందు తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు నిలకడగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడతారు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. స్పెక్యులేషన్ కు, షేర్లకు కూడా దూరంగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణాలు వాయిదా పడ తాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యో గాలు బిజీగా సాగిపోతాయి. వ్యాపారాలలో మార్పులు చేపడతారు. ప్రభుత్వ ఉద్యోగులకు మరిం తగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, పెంచడానికి ఇది సమయం కాదు. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు విజ యవంతం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికర ఫలితాలనిస్తాయి. పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవు తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరంగా శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలు పుంజుకుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, ఆశ్లేష)

ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. రాబడి బాగా పెరిగి ముఖ్యమైన అవసరాలు తీరిపో తాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. అనుకున్న పెళ్లి సంబంధం కుదురు తుంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగంలో అధి కారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇప్పుడు చేసే ప్రయత్నాలు, తీసుకునే నిర్ణయాలు మున్ముందు సత్ఫలితాలనిస్తాయి. అనుకోని ధన లాభం ఉంది. వ్యక్తిగత సమస్యలకు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. బాధ్యతల మార్పు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు, చేర్పులతో లాభాలు పొందుతారు. ఉద్యోగం మార వలసిన అవసరం ఉండకపోవచ్చు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం సానుకూలంగా మారడం జరుగు తుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. అన వసర ఖర్చులు తగ్గించుకోవలసిన అవసరం ఉంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు, శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహ కాలు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆటం కాలున్నా ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు కొద్దిగా విసిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దగ్గర బంధువులతో విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి. అదనపు ఆదాయ ప్రయ త్నాల వల్ల ఇరకాటంలో పడతారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.వద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!