Weekly Horoscope: ఈ రాశుల వారికి ఈ వారంలో మంచి ఫలితాలు.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
Weekly Horoscope: ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా ఈ వారంలో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే తమపై గ్రహ ప్రభావం ఎలా ఉంది అంటూ మంచి చెడుల..
Weekly Horoscope: ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా ఈ వారంలో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే తమపై గ్రహ ప్రభావం ఎలా ఉంది అంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. తమ జాతకాన్నీ నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం వారఫలాల(Weekly Horoscope) గురించి తెలుకోవాలనుకుంటారు. రాశిఫలాలు ఆధారంగా తమకు ఈ వారం రోజులు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో మే 22 నుంచి 28వ తేదీ వరకు ఈ వారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
- మేష రాశి: నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంపై ప్రత్యేక దృష్టి సారించి పట్టుదలతో ముందకెళితే మంచి ఫలితాలు ఉంటాయి. శ్రమ పెరిగిన విజయం ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వివాదాల జోలికి వెళ్లకపోవడం మంచిది. మిత్రుల సలహాలు, సూచనలు పాటించడం, పెద్దలను గౌరవించడండి.
- వృషభ రాశి: ఉత్సాహంగా పని చేస్తే ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తారు.
- మిథున రాశి: ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఇంట్లోవారి సూచనలు పాటించాలి. కొన్ని మీకు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి.
- కర్కాటక రాశి: పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారులకు మంచి అవకాశాలు ఉంటాయి.
- సింహ రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
- కన్య రాశి: ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది.
- తుల రాశి: ముఖ్యమైన కార్యాల్లో శ్రద్ద పెట్టాలి. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి. మీపై లేనిపోని ఆరోపణలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయాలలో కాస్త జాగ్రత్తగా వహించాలి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు పాటించాలి.
- వృశ్చిక రాశి: ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అపోహాలు తొలగుతాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది. ఇరుతల సలహాలు తీసుకోవాలి.
- ధనుస్సు రాశి: ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి పనులు చేసి ప్రశంసలు పొందుతారు. మీ తెలివితో పెద్దలను ఒప్పించగలుగుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- మకర రాశి: తొందర పాటుతో ఏ నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ధైర్యంతో ముందుకెళ్లండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి.
- కుంభ రాశి: వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో మంచిది. కుటుంబ సభ్యుల నిర్ణయాలతో మీకు మంచి జరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
- మీన రాశి: ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. అధికారుల నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మిత్రుల నుంచి సహాయం అందుకుంటారు.
ఇవి కూడా చదవండి
(నోట్: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)