AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారు ధన, ధాన్యాభివృద్ధిని అందుకుంటారు..

రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 22వ తేదీ )ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారు ధన, ధాన్యాభివృద్ధిని అందుకుంటారు..
Horoscope Today
Surya Kala
|

Updated on: May 22, 2022 | 7:02 AM

Share

Horoscope Today (22-05-2022): నేటికీ జాతకాలను, రాశిఫలాలను నమ్మేవారున్నారు. అంతేకాదు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏ రంగంలో ఉన్నవారైనాసరే.. రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 22వ తేదీ )ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు అందరి సహకారంతో ముందుకు వెళ్లారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. శుభకాలం. ఉద్యోగస్తులు తమ పనితీరుతో అధికారుల మన్ననలు పొందుతారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో సంతోషన్ని నింపే శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకూల ఫలితాలను అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. బంధువులతో వివాదాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలతో మెలగాల్సి ఉంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్త వింటారు. నూతన వస్తు, వస్త్ర, నగలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. ఈరాశివారికి ధన, ధాన్యాల వృద్ధి కలుగుతుంది. శుభకాలం. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆనందాన్ని కలిగించే శుభవార్త వింటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రయాణాలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలను సూచనలు తీసుకోవాలి.  చేపట్టిన పనుల్లో అధిక శ్రమ కలగకుండా ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంది. తక్కువ మాట్లాడడం శుభకరం.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు.  ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మానసిక ధైర్యంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆశించిన ఫలితాలను అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు శుభవార్త వింటారు. చంచల నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు పనితీరుపై ప్రశంసలను అందుకుంటారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పని పూర్తి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read : 

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌