Weekly Horoscope: వారి కుటుంబంలో ఓ శుభ పరిణామం పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

వార ఫలాలు (జూలై 21 నుంచి జూలై 27, 2024 వరకు): మేష రాశి వారి ఆదాయం ఈ వారం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. మిథున రాశి వారి అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే...

Weekly Horoscope: వారి కుటుంబంలో ఓ శుభ పరిణామం పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
Weekly Horoscope 21st July 2024 To 27th July 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 21, 2024 | 5:01 AM

వార ఫలాలు (జూలై 21 నుంచి జూలై 27, 2024 వరకు): మేష రాశి వారి ఆదాయం ఈ వారం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. మిథున రాశి వారి అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే…

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడు, ధన స్థానంలో గురువు, నాలుగవ స్థానంలో రవి, శుక్రులు, పంచమంలో బుధుడు వారం రోజుల పాటు మిమ్మల్ని సుఖ సంతోషాల్లో ముంచెత్తుతాయి. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా సునాయాసంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కొందరు మిత్రుల వల్ల నష్టపోతారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచ యాలు పెరుగుతాయి. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. తరచూ శివార్చన చేయడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

దశమ స్థానంలో శని, లాభ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శుక్ర, రవుల వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే సూచ నలున్నాయి. వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో ఏదైనా శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రతి రోజూ ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ధన స్థానంలో రవి, శుక్రులు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం వల్ల ప్రయత్న పూర్వక ధన లాభం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంత కష్టపడితే అంత మంచిది. కొద్ది శ్రమతో ఎటువంటి ప్రయ త్నమైనా, ఏ పని చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకో కుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే అవకాశం ఉంది. అంచనాలకు మించి జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబంతో కలిసి తీర్థ యాత్రలు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. తల్లితండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమై విలు వైన ఆస్తి కలిసి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గురువు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అష్టమ శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగు లకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సరైన స్పదన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. లలితా సహస్ర నామం చదువు కోవడం వల్ల మరింత మంచి జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

దశమ స్థానంలో గురు, కుజులు, సింహరాశిలో బుధుడి సంచారం కారణంగా ఉద్యోగ జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు కూడా జోరుగా సాగిపోతాయి. ఉద్యోగపరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడ తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఇల్లు కొనే విషయం ఆలోచిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్ర త్తగా ఉండడం మంచిది. విదేశాల్లో ఉన్న బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

భాగ్య స్థానంలో గురువు, లాభ స్థానంలో శుక్ర, రవులు, ఆరవ స్థానంలో శనీశ్వరుడు బాగా అను కూలంగా ఉన్నందువల్ల అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం బాగా అనుకూలంగా మారతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలకు అవకాశం ఉంది. ముఖ్య మైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికా రుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారులు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. స్కందాష్టకం చదువుకోవడం వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆరవ స్థానంలో రాహువు, దశమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు, రవి, లాభ స్థానంలో బుధుడి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడి, ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో అంచనాకు మించి లాభాలు పెరుగుతాయి. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల ఆశించిన లాభం పొందుతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి కుజుడు, గురువుల వల్ల తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాలను పొందుతారు. అర్ధాష్టమ శని ప్రభావం బాగా తగ్గి, కొన్ని కష్టనష్టాల నుంచి గట్టెక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. పంచమ స్థానంలోని రాహువు వల్ల ఆర్థిక వ్యవహారాల్లో, ఆస్తి వివాదాల్లో పొరపాట్లు చేయడం జరుగుతుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు మంద కొడిగా సాగుతాయి. మిత్రుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సుందరకాండ పారాయణం చాలా మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశ్యధిపతి గురువుతో షష్ట స్థానంలో కుజుడు కలిసి ఉన్నందువల్ల ఒక ప్రణాళిక ప్రకారం ఆదా యాన్ని పెంచుకోవడం, ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడం జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. తృతీయంలో ఉన్న శనికి, భాగ్య స్థానంలో ఉన్న బుధుడితో వీక్షణ ఏర్పడినందువల్ల ఆర్థిక ప్రణాళికలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగి పోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. విదేశాల్లోని పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ప్రతి రోజూ ఉదయం గణపతి స్తోత్రం చదువుకోవడం శుభప్రదం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశినాథుడైన శని ధన స్థానంలో, రాహువు తృతీయంలో సంచారం చేస్తున్నందువల్ల అన్ని విషయాల్లోనూ ఆశించిన పురోగతి ఉంటుంది. పంచమంలో గురు, కుజుల వల్ల ప్రతి పనినీ, ప్రతి వ్యవహారాన్నీ పట్టుదలగా సాధించుకుంటారు. రవి, శుక్రులు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోకుండా, అప్రయత్నంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లల చదువుల పట్ల కాస్తంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. తరచూ శివార్చన చేయించడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం తగ్గుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

చతుర్థ స్థానంలో గురు, కుజుల సంచారం వల్ల వారమంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఏవైనా సమస్యలు ఎదురైనా సత్వర పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. వృత్తుల్లో ఉన్నవారు అంచనాలకు మించి లాబాలు గడి స్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. తరచూ స్కంధాష్టకం చదువుకోవడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి గురువుతో తృతీయ స్థానంలో కుజుడు కలిసి ఉండడం, పంచమ స్థానంలో శుక్ర, రవులు సంచారం చేయడం వల్ల ఆర్థికంగా తిరుగులేని అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు అంచనాలకు మించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో మంచి రాజయోగం పట్టే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. సామాజికంగా కూడా గౌరవాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అదనపు ఆదాయ ఆశిం చిన దాని కంటే ఎక్కువగా సఫలం అవుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల అరిష్టాలు తొలగు తాయి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!