Money Astrology: రాహువు బలంతో ఆ రాశుల వారికి ధన ప్రవాహం! వారికి ఆకస్మిక ధన లాభాలు..

ప్రస్తుతం రాహువు మీన రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం ప్రారంభించినందువల్ల రాశ్యధిపతి గురువు ప్రభావం, ఉత్తరాభాద్ర నక్షత్రాధిపతి శని ప్రభావం రాహువు మీద పడింది. దీనివల్ల రాహువు బలం దాదాపు రెట్టింపయింది. మేషం, కర్కాటకం, సింహం, కన్య, కుంభ, మీన రాశుల వారికి కూడా ఆదాయపరంగా అంచనాలకు మించిన అభివృద్ధి కనిపిస్తోంది.

Money Astrology: రాహువు బలంతో ఆ రాశుల వారికి ధన ప్రవాహం! వారికి ఆకస్మిక ధన లాభాలు..
Money Astrology
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 20, 2024 | 6:14 PM

ప్రస్తుతం రాహువు మీన రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం ప్రారంభించినందువల్ల రాశ్యధిపతి గురువు ప్రభావం, ఉత్తరాభాద్ర నక్షత్రాధిపతి శని ప్రభావం రాహువు మీద పడింది. దీనివల్ల రాహువు బలం దాదాపు రెట్టింపయింది. మేషం, కర్కాటకం, సింహం, కన్య, కుంభ, మీన రాశుల వారికి కూడా ఆదాయపరంగా అంచనాలకు మించిన అభివృద్ధి కనిపిస్తోంది. రాహువు వక్ర గ్రహం అయినందువల్ల సక్రమంగానే కాక, అక్రమంగా కూడా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉండడంతో పాటు, వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో రాహు సంచారం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావ లసిన సొమ్మును గట్టి ప్రయత్నంతో వసూలు చేయడం జరుగుతుంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో సైతం పోటీదార్లను మించి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. వడ్డీ వ్యాపా రాలు, ఆర్థిక లావాదేవీలు ఇబ్బడిముబ్బడిగా లాభాలను తెచ్చి పెడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోవడమే కాక, విస్తరించే అవకాశం కూడా ఉంది. శత్రువుల వల్ల లాభపడతారు.
  2. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతుంది. సంప్రదాయ విరుద్ధమైన కార్యకలాపాల ద్వారా కూడా ఆదాయం పెరిగే అవ కాశం ఉంది. తండ్రి నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతాయి. గృహ, వాహన సౌకర్యా లను అమర్చుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. అనేక మార్గాల్లో, అనూహ్యంగా, ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.
  3. సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల, ఈ రాశివారికి తప్పకుండా ఆకస్మిక ధన లాభా నికి అవకాశం ఉంది. జూదాలు, వడ్డీ వ్యాపారాలు, ఉద్యోగంలో అదనపు రాబడి వంటి వాటి వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆర్థిక యోగాలు పట్టే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో వివాహం నిశ్చయం కావడం జరు గుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం కావడం ద్వారా విలువైన ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది.
  4. కన్య: సాధారణంగా సప్తమ స్థానంలో రాహువు దుష్ఫలితాలనిస్తుంది. అయితే, రాహువును గురు, శనులు ప్రభావితం చేస్తున్నందువల్ల అది తప్పకుండా ఉత్తమ ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా జీవన శైలి మారిపోతుంది. సంపన్న కుటుంబం లేదా పలుకుబడి కలిగిన కుటుంబంతో వివాహం నిశ్చయం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా అదృష్టం పడుతుంది. విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది.
  5. కుంభం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగు తుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో అదనపు ఆదాయానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆర్థి కంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలకు మించి పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడి, లాభాల బాట పట్టడానికి బాగా అవకాశం ఉంది. లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార ఒప్పందాల వల్ల లాభాలు పెరుగుతాయి.
  6. మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహువు వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ అనూ హ్యంగా పెరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. జూదాలు, షేర్లు, వడ్డీ వ్యాపారాలు, అదనపు రాబడి ఆదాయాన్ని బాగా పెంచుతాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి.

మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..
మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..
ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఎంపీలతో కీలక చర్చ
ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఎంపీలతో కీలక చర్చ
పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. మొత్తం లాగించేస్తారు..
పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. మొత్తం లాగించేస్తారు..
కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ
కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ
బంక లడ్డూలు.. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!
బంక లడ్డూలు.. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!
సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..
సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..
ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..
ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..
టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..
టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..
తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??
తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??
జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?
జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?