Lucky Zodiac Signs: కీలక స్థానాల్లో గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి విపరీత రాజయోగం పట్టే అవకాశం..! మీ రాశికి ఇలా..

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆరు, ఎనిమిది, పన్నెండు స్థానాధిపతులు ఒకరి రాశిలో మరొకరు ఉన్నప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ స్థానాధిపతులు ఎవరి రాశుల్లో వారున్నా విపరీత రాజయోగం పడుతుంది. అంటే ఆరవ స్థానాధిపతి ఎనిమిది, పన్నెండు రాశుల్లో, ఎనిమిదవ స్థానాధిపతి పన్నెండు, ఆరు రాశుల్లో, పన్నెండవ స్థానాధిపతి ఆరు, ఎనిమిది రాశుల్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది.

Lucky Zodiac Signs: కీలక స్థానాల్లో గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి విపరీత రాజయోగం పట్టే అవకాశం..! మీ రాశికి  ఇలా..
Vipreet Raj Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 19, 2023 | 6:49 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆరు, ఎనిమిది, పన్నెండు స్థానాధిపతులు ఒకరి రాశిలో మరొకరు ఉన్నప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ స్థానాధిపతులు ఎవరి రాశుల్లో వారున్నా విపరీత రాజయోగం పడుతుంది. అంటే ఆరవ స్థానాధిపతి ఎనిమిది, పన్నెండు రాశుల్లో, ఎనిమిదవ స్థానాధిపతి పన్నెండు, ఆరు రాశుల్లో, పన్నెండవ స్థానాధిపతి ఆరు, ఎనిమిది రాశుల్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఏ పనిచేసినా, ఏ మాటన్నా చెలామణీ అయిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రస్తుత గ్రహ సంచారం రీత్యా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ధనుస్సు, మకరం, మీన రాశులకు ఈ యోగం పడుతోంది.

మేషం: ఈ రాశికి ఎనిమిదవ స్థానాధిపతి అయిన కుజుడు ఎనిమిదవ స్థానంలోనే (వృశ్చికంలోనే) సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో బాగా ప్రాభవం పెరుగుతుంది. లక్ష్యా లన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనేక అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

వృషభం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానంలోనే ఉండడం, ఎనిమిదవ స్థానా ధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల విశేషమైన విపరీత రాజయోగం ఏర్పడింది. దీని ఫలితంగా ఆర్థిక స్థిరత్వం ఏర్పడడంతో పాటు, వృత్తి, ఉద్యోగాలపరంగా ఏది కోరుకుంటే అది జరుగుతుంది. చాలా కాలం నుంచి వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులు అనుకూలంగా మారతారు. జీవితం చాలావరకు రాజాలాగా గడిచిపోతుంది.

మిథునం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన కుజుడు ఆరవ స్థానంలోనే ఉండడం వల్ల విపరీత రాజ యోగం ఏర్పడింది. ఫలితంగా శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. బాగా డబ్బు కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా కూడా మంచి ఆఫర్లు అంది వస్తాయి. విదేశీ యానానికి సంబంధించిన సమస్యలు లేదా ఆటంకాలు తొలగిపోతాయి.

కర్కాటకం: ఈ రాశివారికి 12వ స్థానాధిపతి అయిన బుధుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఈ విశేషమైన యోగం ఏర్పడింది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం, లిక్కర్ వ్యాపారం వంటివి ఊపందుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, ఇంటా బయటా కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనుస్సు: ఈ రాశివారికి 12వ స్థానాధిపతి అయిన కుజుడు 12లోనే ఉండడం వల్ల సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు పెంపొందుతాయి. విదేశీయానానికి, విదేశాల్లో స్థిరత్వానికి అవకాశం ఉంటుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి ఆశించిన స్థాయిలో ఉపశ మనం లభించడంతో పాటు వైద్య ఖర్చులు బాగా తగ్గిపోతాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు లేదా యాజమాన్యాల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో ఆదరణ లబిస్తుంది. అధికార యోగానికి లేదా ప్రమోషన్ కి అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం కావడం, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం కావడం జరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మీనం: ఈ రాశికి 8వ స్థానాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలోనే సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారు విపరీత రాజయోగ ఫలాలను అనుభవించడం జరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాలు అంచనాలకు మించి లాభిస్తాయి. జీవిత భాగ స్వామికి కూడా అదృష్టం పడుతుంది. అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.