Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Dev: శనీశ్వరుడి ఎఫెక్ట్.. ఆ రాశుల వారికి జీవితంలో కొంతకాలం స్ట్రగుల్ తప్పదు..!

శనీశ్వరుడి కారణంగా ఆరు రాశుల వారికి కొద్ది కాలం పాటు జీవితంలో ‘స్ట్రగుల్’ తప్పదు. ముఖ్య మైన వ్యవహారాల్లో, కీలక అంశాల్లో పోరాటం, పెనుగులాట, శ్రమ, ఒత్తిడి వంటివి అనివార్యమవు తాయి. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కొద్దిగా కష్టపెట్టినా అంతిమంగా మంచే చేస్తాడు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ‘రాచి రంపాన పెట్టే’ అవకాశం ఉంటుంది. వెట్టి చాకిరీ ఎక్కువవుతుంది.

Shani Dev: శనీశ్వరుడి ఎఫెక్ట్.. ఆ రాశుల వారికి జీవితంలో కొంతకాలం స్ట్రగుల్ తప్పదు..!
Lord Shani Dev
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 19, 2023 | 6:38 PM

శనీశ్వరుడి కారణంగా ఆరు రాశుల వారికి కొద్ది కాలం పాటు జీవితంలో ‘స్ట్రగుల్’ తప్పదు. ముఖ్య మైన వ్యవహారాల్లో, కీలక అంశాల్లో పోరాటం, పెనుగులాట, శ్రమ, ఒత్తిడి వంటివి అనివార్యమవు తాయి. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కొద్దిగా కష్టపెట్టినా అంతిమంగా మంచే చేస్తాడు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ‘రాచి రంపాన పెట్టే’ అవకాశం ఉంటుంది. వెట్టి చాకిరీ ఎక్కువవుతుంది. ఒకటికి రెండుసార్లు ప్రయత్నిస్తే తప్ప ఏ పనీ పూర్తి కాదు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కూడా వాయిదా పడుతుంటాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. నిద్రకు కూడా నోచుకోని పరిస్థితులుంటాయి. అయితే, శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభ రాశిలోనే సంచారం చేస్తున్నందువల్ల మరీ ఎక్కువగా కష్టపెట్టే అవకాశం ఉండదు. అంతేకాక, ఇతర గ్రహాల అనుకూల సంచారం వల్ల కూడా మధ్య మధ్య కష్టనష్టాల బారి నుంచి ఉపశమనం ఉంటూ ఉంటుంది. కొద్దిగా పరిహారం చేసుకున్నా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ ఆరు రాశులుః కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీనం.

  1. కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల శారీరక, మానసిక శ్రమ కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు పెరగడం కాస్తంత కష్టమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో వెట్టి చాకిరీ తప్పకపోవచ్చు. ప్రతిఫలం లేని పనులు చేయాల్సి వస్తుంది. ఎంత చేసినా అధికారులకు తృప్తి ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామి మధ్య మధ్య అనారోగ్యాలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. తానొకటి తలచిన దైవమొకటి తలచును అన్నట్టుగా ఉంటుంది.
  2. సింహం: ఈ రాశికి సప్తమంలో శని సంచారం వల్ల ఇంటా బయటా చెప్పుకోలేని ఒత్తిడి ఉంటుంది. ఈ రాశి వారి నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేయడం జరుగుతుంది. ఎటు నుంచీ సహాయం అందని పరిస్థితి తలెత్తుతుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో స్ట్రగుల్ ఉంటూనే ఉంటుంది. ఏ పనీ తొందరగా లేదా సకాలంలో పూర్తి కాదు. మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. మీ డబ్బు మీకు ఒక పట్టాన తిరిగి రాదు. మీరు ఇవ్వాల్సిన చోట విపరీతంగా ఒత్తిడి ఉంటుంది.
  3. వృశ్చికం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఇంటా బయటా సుఖశాంతులు బాగా తగ్గుతాయి. లేనిపోని బాధ్యతలు నెత్తిన పడతాయి. ఉద్యోగంలో సహచరుల విధులను కూడా మీరే నిర్వర్తించాల్సి వస్తుంది. అనవసర ప్రయాణాలతో ఇబ్బంది పడతారు. చేతిలో ఒక పట్టాన డబ్బు నిలవదు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండకపోవచ్చు. ఉపయోగించుకుని వదిలేసే వారు ఎక్కువగా ఉంటారు. చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రతిభకు తగ్గ ఉద్యోగం లభించదు.
  4. మకరం: ఈ రాశివారికి పని భారం బాగా పెరుగుతుంది. ఇంటా బయటా ఇతరుల భారం మీద పడుతుంది. ఆర్థికంగా బాగున్నా చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఉంటుంది. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి కానీ, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బాగా ఉపయోగించుకోవడం ఎక్కువగా ఉంటుంది. పని భారం, పని ఒత్తిడి కారణంగా విశ్రాంతి, విరామం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర ప్రయాణాల వల్ల ఖర్చు బాగా పెరుగుతుంది.
  5. కుంభం: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా ‘వెట్టి చాకిరీ’, కంచి గరుడ సేవలు తప్పకపోవచ్చు. ఇతరుల స్వలాభానికి ఈ రాశివారు ఉపయోగపడడం ఎక్కువగా ఉంటుంది. ఎంత శ్రమ పడ్డా ఆర్థికంగా ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది. బంధువుల నుంచి అప నిం దలు, విమర్శలు ఎక్కువగానే ఉంటాయి. ఆదాయం కన్నా అవమానాలు ఎక్కువగా ఉండే అవ కాశం ఉంది. నిద్ర లేమి, అజీర్ణం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పట్టుకునే అవకాశం ఉంటుంది.
  6. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం ఉంటుంది. దీని ఫలితంగా తిప్పట, అధిక వ్యయం, మోసపోవడం, నష్టపోవడం, అనవసర ప్రయాణాలు, దుర్వా ర్తలు వినడం, స్వల్ప అనారోగ్యాలు వంటివి తప్పకపోవచ్చు. బంధుమిత్రులతో అపార్థాలు పెరిగే సూచనలున్నాయి. ఆస్తి వివాదాలు తీవ్ర అసంతృప్తి కలిగిస్తాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడానికి ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. రహస్య శత్రువుల సంఖ్య పెరుగుతుంది.

ముఖ్యమైన పరిష్కారాలు: జీవిత పాఠాలు నేర్చుకోవడానికే శనీశ్వరుడు ఈ విధంగా ఇబ్బందులు పెడతాడని, చేదు అనుభవాలనిస్తాడని జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల లేదా తరచూ శివాలయాన్ని సందర్శించడం వల్ల శని బెడద చాలా వరకు తగ్గుతుందని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. సుందరకాండ పారాయణం చేసినా శనీశ్వరుడి బెడద చాలా వరకు తగ్గుతుంది. పేదలకు అన్నదానం చేయడం వల్ల కూడా శనీశ్వరుడి బాధ తగ్గే అవకాశం ఉంటుంది. శని కొద్దిగా బాధ పెట్టినప్పటికీ అంతిమంగా మేలే చేస్తాడని ప్రతీతి.