Horoscope Today: వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు..
దిన ఫలాలు (డిసెంబర్ 20, 2023): మేష రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన ప్రతి పనినీ పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (డిసెంబర్ 20, 2023): మేష రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన ప్రతి పనినీ పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
బంధువులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల బరువు తప్పకపోవచ్చు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ చాలావరకు మీదే పైచేయిగా ఉంటుంది. నమ్మకస్థులైన స్నేహితుల సహాయంతో కొన్ని వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను కూడా పట్టుదలగా పూర్తి చేయగలుగుతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. నిరుద్యో గులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సంద ర్శిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. డబ్బుకు లోటుండదు. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. ఆరోగ్యం సాదా సీదాగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన ప్రతి పనినీ పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు మిత్రుల సలహాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. డబ్బుకు పెద్దగా సమస్య ఉండక పోవచ్చు. ఖర్చులు కూడా బాగా అదుపులో ఉంటాయి. సంసార జీవితం ఆశించిన విధంగానే సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనుల్లో కొద్దిగా ఆలస్యం జరుగు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు, వ్యవ హారాలు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి సల హాలు, సూచనలను తీసుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఇతరులకు సహాయం చేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులుంటాయి. వ్యాపారాలు చాలావరకు లాభదాయకంగా సాగిపోతాయి. కొందరు బంధువులతో మాట పట్టింపులు ఉండవచ్చు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి దాదాపు పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. రావలసిన డబ్బు అప్రయత్నంగా చేతికి అందుతుంది. కొందరు రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. కొందరు దూరపు బంధువులు వచ్చి కలుస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక వస్తు లాభాలు పొందుతారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కుటుంబ సభ్యులతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. జీవిత భాగ స్వామి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో అందరి కంటే ముందుంటారు. ఇత రులు మీ సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
మిత్రులతో స్వల్ప విభేదాలకు అవకాశం ఉంది. చేపట్టిన పనులు నత్తనడక నడుస్తాయి. ఆర్థిక విషయాలు ఆశించిన విధంగా ముందుకు వెడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అనుకూలంగా ఉన్నప్పటికీ సహచరుల నుంచి ఇబ్బందులు తలెత్తే సూచనలున్నాయి. వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారాలు బాగానే ఆదుకుంటాయి. దూర ప్రాంతం నుంచి ఊహించని శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయటా పరిస్థితులు బాగా అను కూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మంచి కాలక్షేపం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూ లతలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా వ్యయ ప్రయాసలున్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు సునాయాసంగా పరిష్కారమవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులను అనుకున్నట్టు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు, ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. చిన్న నాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. మధ్య మధ్య ఆరోగ్యం సంగతి కూడా చూసుకోవడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శ్రవణం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇష్టమైన బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్త వుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో రావలసిన ప్రమోషన్లు లభిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు న్నాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఏ కొద్ది సమయం దొరికినా దైవ కార్యాల్లో మునిగి తేలుతుంటారు. పిల్లల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.