Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: వృశ్చిక రాశిలో కుజ గ్రహం ఒంటరి ప్రయాణం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!

వృశ్చిక రాశిలో కుజ గ్రహం ఒంటరి ప్రయాణం ప్రారంభించడంతో ఆరు రాశుల వారికి కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి రానున్నాయి. ఇంతవరకూ వృశ్చికంలో రాశ్యధిపతి కుజుడితో కలిసి ఉన్న రవి ధనూరాశిలోకి వెళ్లడంతో కుజుడు ఒక్కడే తన స్వస్థానంలో మిగిలిపోవడం జరిగింది. ఈ కుజుడు ఆ తర్వాత ఈ నెల 27న ధనూ రాశిలోకి మారినప్పటికీ ఈ ఆరు రాశులకు తప్పకుండా ధన యోగం పట్టించడం జరుగుతుంది.

Money Astrology: వృశ్చిక రాశిలో కుజ గ్రహం ఒంటరి ప్రయాణం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
Money
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 19, 2023 | 6:57 PM

వృశ్చిక రాశిలో కుజ గ్రహం ఒంటరి ప్రయాణం ప్రారంభించడంతో ఆరు రాశుల వారికి కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి రానున్నాయి. ఇంతవరకూ వృశ్చికంలో రాశ్యధిపతి కుజుడితో కలిసి ఉన్న రవి ధనూరాశిలోకి వెళ్లడంతో కుజుడు ఒక్కడే తన స్వస్థానంలో మిగిలిపోవడం జరిగింది. ఈ కుజుడు ఆ తర్వాత ఈ నెల 27న ధనూ రాశిలోకి మారినప్పటికీ ఈ ఆరు రాశులకు తప్పకుండా ధన యోగం పట్టించడం జరుగుతుంది. దాదాపు రెండున్నర నెలల పాటు ఈ రెండు రాశుల్లోనూ సంచరించే కుజుడి వల్ల ఈ రాశుల మీద కనక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. ఈ రాశులుః మేషం, తుల, ధనుస్సు, వృశ్చికం, కుంభం, మీనం.

  1. మేషం: ఈ రాశినాథుడైన కుజుడు తన స్వస్థానమైన వృశ్చికంలో ప్రస్తుతం సంచరిస్తూ ఉండడం, ఆ తర్వాత భాగ్యస్థానమైన ధనుస్సులో సంచరించడం వల్ల ఈ రాశివారికి ఏమాత్రం ఊహించని ధన యోగం పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అప్రయత్న ధన ప్రాప్తికి అవకాశం ఉంది. లాటరీలు, జూదాలు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, షేర్లు వగైరాల వల్ల అంచనాలకు మించిన ఆదాయ వృద్ధి ఉంటుంది. భూ సంబంధమైన వ్యాపారాలు, వ్యవసాయం బాగా కలిసి వచ్చి సంపద పెరుగుతుంది.
  2. తుల: ఈ రాశివారికి ప్రస్తుతం ధన స్థానంలో సంచరిస్తున్న కుజుడు తప్పకుండా ధనయోగం కలిగించే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి, సంపాదన బాగా పెరిగే సూచనలున్నాయి. కుటుంబపరంగా కూడా ధన వృద్ధి పెరగడానికి అవకాశం ఉంది. సతీ మణికి కొత్త ఉద్యోగం లభించడం లేదా ఉద్యోగంలో ఉన్నవారికి జీత భత్యాలు పెరగడం జరుగుతుంది.
  3. వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం తన స్వస్థానంలోనే సంచరిస్తూ ఉండడం, ఆ తర్వాత ధనస్థానంలో ప్రవేశించడం వల్ల ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అతి తక్కువ శ్రమతో అత్యధిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంపాదన బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సొంత పొలాలు, స్థలాల విలువ అంచనాలకు మించి పెరగడం జరుగుతుంది. సంపన్నులయ్యే అవకాశం ఉంది.
  4. థనుస్సు: ఈ రాశివారికి ప్రస్తుతం వ్యయ స్థానంలో ఉన్న కుజుడు ఈ నెలాఖరు నుంచి సొంత రాశిలో ప్రవే శిస్తున్నందువల్ల మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. తప్పకుండా ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. లాటరీలు, షేర్లు, జూదాలు, పందాలు వంటివి బాగా కలిసి వస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికార యోగంతో పాటు, భారీగా జీత భత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. స్థిరాస్తుల ద్వారా కూడా సంపద పెరిగే అవకాశం ఉంది.
  5. కుంభం: ఈ రాశివారికి 10, 11 స్థానాల్లో కుజ సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలా పాలు బాగా పెరిగి, ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించడం లేదా అధికారం దక్కడం వంటివి జరిగి, జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా ధన లాభం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది.
  6. మీనం: ఈ రాశికి ప్రస్తుతం భాగ్య స్థానంలో ఉన్న కుజుడు ఆ తర్వాత ఉద్యోగ స్థానంలోకి వస్తున్నందువల్ల తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో ధన యోగం పట్టే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా ఫలప్రదం అవుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. స్థిరాస్తుల వల్ల సంపద వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ మార్గాల ద్వారా అంచనాలకు మించిన ఆదాయం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి.