Lucky Zodiac Signs: అనుకూల స్థితిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి కనక వర్షం పట్టనుంది..!

సాధారణంగా గ్రహాలకు కూడా ఇష్టమైన రాశులుంటాయి. తమకు ఇష్టమైన రాశులను అవి సర్వకాల, సర్వావస్థలా కాపాడుతూ ఉంటాయి. వీలైనంత వరకూ శుభ ఫలితాలను ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. సుఖ సంతోషాలకు, భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడికి తన స్వస్థానాలైన వృషభ, తులా రాశులు, తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశితో పాటు తన మిత్ర క్షేత్రాలైన మిథునం, మకరం, కుంభ రాశులకు కూడా వీలైనంతగా శుభ ఫలితాలనే ఇస్తాడు.

Lucky Zodiac Signs: అనుకూల స్థితిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి కనక వర్షం పట్టనుంది..!
shukra transit 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 20, 2023 | 6:09 PM

సాధారణంగా గ్రహాలకు కూడా ఇష్టమైన రాశులుంటాయి. తమకు ఇష్టమైన రాశులను అవి సర్వకాల, సర్వావస్థలా కాపాడుతూ ఉంటాయి. వీలైనంత వరకూ శుభ ఫలితాలను ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. సుఖ సంతోషాలకు, భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడికి తన స్వస్థానాలైన వృషభ, తులా రాశులు, తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశితో పాటు తన మిత్ర క్షేత్రాలైన మిథునం, మకరం, కుంభ రాశులకు కూడా వీలైనంతగా శుభ ఫలితాలనే ఇస్తాడు. జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్న పక్షంలో తనకిష్టమైన రాశుల మీద కనక వర్షం కురిపించడంతో పాటు, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చి సుఖ సంతోషాలు కలగజేస్తాడు. శుక్రుడు బలంగా ఉన్న రాశివారు సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. అటువంటి వారి మీద శుక్రుడు మరింతగా అనుగ్రహ దృష్టిని ప్రసరిస్తాడు. ప్రస్తుతం తన స్వస్థానంలో ఉన్న శుక్రుడు తనకు ఇష్టమైన ఆరు రాశుల మీద ఏ విధంగా కటాక్ష వీక్షణాలు ప్రసరిస్తాడో పరిశీలిద్దాం.

  1. వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడు తనకు రెండవ స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేస్తున్నందువల్ల అనేక శుభ ఫలితాలనివ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు, ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరిస్తాడు. వృత్తి, ఉద్యోగాల్లో ఎలాంటి సమస్యలున్నా తొల గించి, అధికారానికి మార్గం సుగమం చేస్తాడు. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుతాడు. శత్రు వులు, పోటీదార్లు, ప్రత్యర్థులను బలహీనపరుస్తాడు. రావలసిన డబ్బు చేతికి అందేలా చేస్తాడు.
  2. మిథునం: ఈ రాశినాథుడైన బుధుడికి శుక్రుడు మిత్ర గ్రహం అయినందువల్ల ఈ రాశివారికి అన్ని విధాలు గానూ అండగా నిలబడతాడు. శుక్రుడి అనుకూలత వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఈ రాశివారి సలహాలు, సూచనలకు, అభిప్రాయాలకు ఎంతో విలువ ఉంటుంది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనేక సౌకర్యాలు సమకూరుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
  3. తుల: ఈ రాశినాథుడైన శుక్రుడు ప్రస్తుతం ఇదే రాశిలో కొనసాగుతున్నందువల్ల మనసులోని కోరికల్లో చాలా భాగం సునాయాసంగా నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో ఎటువంటి పొరపచ్చాలున్నా సమసిపోయి, దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. విలాసాల్లో, విందుల్లో మునిగి తేలడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది.
  4. మకరం: శుక్ర గ్రహానికి ఈ రాశినాథుడైన శనీశ్వరుడు మిత్రుడైనందువల్ల, ఈ రాశివారికి శుక్ర గ్రహం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలమవుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సుఖ సంతోషాలతో పాటు మనశ్శాంతికి కూడా కొదవ ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది.
  5. కుంభం: ఈ రాశినాథుడైన శనీశ్వరుడికి శుక్రుడు మిత్ర గ్రహం అయినందువల్ల జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడున్నా ఈ రాశివారికి చాలావరకు అనుకూల ఫలితాలనే ఇస్తాడు. తల్లితండ్రుల నుంచి ఆశిం చిన సహాయ సహకారాలు లభిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపో తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  6. మీనం: ఈ రాశి శుక్రుడికి ఉచ్ఛ రాశి. అందువల్ల ఈ రాశివారిని శుక్రుడు అన్ని విధాలుగానూ ఆదు కుంటూ ఉంటాడు. బాగా తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్ని పొందడంతో పాటు, అతి తేలికగా ఈ రాశివారికి భోగభాగ్యాలు అంది వస్తాయి. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు శీఘ్రగతిన పురోగతి సాధి స్తాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలకు విరామం ఉండదు.