May Horoscope: మే నెలలో.. సాఫీగా, హ్యాపీగా ఆ రాశుల వారి జీవితం..!
మే నెలాఖరు వరకు మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా కొనసాగే సూచనలు ఉన్నాయి. ఖర్చులకు తగ్గ ఆదాయం, సాధారణ ఆరోగ్యం, ఉద్యోగం–వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించే అవకాశముంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతూ, కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

Happy Life In May 2026
మే ఆఖరు వరకు కొన్ని రాశుల వారు సంతృప్తికరమైన జీవితం అనుభవించే అవకాశం ఉంది. వీరి జీవితం అద్భుతంగానూ ఉండదు, అధ్వానంగానూ ఉండదు రానీ సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఖర్చులకు తగ్గ ఆదాయం, సాధారణ ఆరోగ్యం, ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురో గతి అనుభవానికి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధుమిత్రులకు కొద్దిగా సహాయపడతారు. కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారి జీవితాలు సాదా సీదాగా, సాఫీగా, హ్యాపీగా పురోగమిస్తాయి.
- మేషం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం ఉన్నప్పటికీ, శుక్ర, గురువుల అనుకూలత వల్ల చెడు ప్రభా వాలు బాగా తగ్గిపోతాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ కొద్దిగా పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి, జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ, దాంపత్య జీవితాలు సుఖ సంతోషాలతో సాగి పోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కొన్ని వృథా ఖర్చులు బాగా తగ్గించుకుంటారు.
- మిథునం: రాశినాథుడు బుధుడు గురువుతో పరివర్తన చెందడం, దశమ స్థానంలో శని సంచారం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి మే చివరి వరకూ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. శుభ పరిణామాలు, శుభ వార్తలకు పెద్దగా అవకాశం లేకపోయినా, ఉన్నంతలో సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంది. ఆదాయం పెద్దగా పెరగకపోవచ్చు కానీ, ఖర్చుల్ని మాత్రం బాగా తగ్గించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు రొటీనుగా, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది కానీ, పని భారం, శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కొద్దిగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో, స్వక్షేత్రంలో సంచారం ప్రారంభిస్తున్నందు వల్ల జీవితం కొద్దిగా హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉంది కానీ, యోగాలకు, శుభ పరిణామాలకు పెద్దగా అవకాశం లేదు. అవసరానికి తగ్గ డబ్బు చేతికి అందుతుంది. రావలసిన సొమ్మును, బాకీలను కొద్ది శ్రమతో రాబట్టుకుంటారు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాలు నిలకడగా సాగుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సంతృప్తికరంగా సాగిపోతాయి.
- ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థాన సంచారం వల్ల జీవితం వైభవంగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ, అర్ధాష్టమ శని దోషం వల్ల ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాక, ఏ ప్రయత్నమూ సంతృప్తి కరంగా నెరవేరక ఇబ్బంది పడతారు. పాత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కొత్త సమస్యలకు అవకాశం లేదు. గృహ, వాహన ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవి తం సాదా సీదాగా సాగిపోతుంది. అవసరాలకు తగ్గట్టుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.
- కుంభం: పంచమ స్థానంలో సంచారం చేస్తున్న ధన, లాభాధిపతి గురువు వల్ల ఆదాయం పెరగడానికి అవకాశం ఉన్నప్పటికీ, ధన స్థానంలో సంచారం చేస్తున్న శని వల్ల డబ్బు ఎక్కువగా వృథా అవుతుంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సామాన్యంగా సాగిపోతుంది. ఆదాయ ప్రయత్నాల వల్ల లాభం కంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు నిదానంగా కొనసాగుతాయి. జీవిత భాగస్వామి వల్ల జీవితం కొద్దిగా హ్యాపీగా సాగుతుంది.
ఇవి కూడా చదవండి
Follow Us



