AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: 2022లో ఈ 3 రాశులవారికి పట్టిందల్లా బంగారమే.. పక్కా అదృష్టవంతులు!

ఎన్నో ఆశలతో ప్రతీ ఒక్కరూ 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. విజయం, డబ్బు, పురోభివృద్ది పొందాలన్న...

Zodiac Signs: 2022లో ఈ 3 రాశులవారికి పట్టిందల్లా బంగారమే.. పక్కా అదృష్టవంతులు!
Zodiac Signs2
Ravi Kiran
|

Updated on: Jan 06, 2022 | 10:49 AM

Share

ఎన్నో ఆశలతో ప్రతీ ఒక్కరూ 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. విజయం, డబ్బు, పురోభివృద్ది పొందాలన్న తపన ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా పలు తీర్మానాలు చేసుకుని.. వాటిని పాటిస్తూ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని చూస్తారు. అయితే కొన్ని రాశులవారు మాత్రం ఈ విషయాల్లో పక్కా అదృష్టవంతులు. వారి కలలు ఈ ఏడాది నెరవేరనున్నాయి. అలాగే లక్ష్యాలను కూడా సాధిస్తారు. మారుతున్న గ్రహాల గమనం కారణంగా వారు ఈ ఏడాది అన్నింటా విజయాలను అందుకుంటారు.

శని మహర్దశలో ఉన్న రాశులవారికి ఏప్రిల్ 2022లో కాస్త ఊరట లభిస్తుంది. ఆ సమయంలో శనిగ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుండటంతో ఆయా రాశులవారి జీవితంలో కష్టాలన్నీ తొలిగిపోతాయి. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే ఈ రాశులవారికి రాహువు ప్రతికూల ప్రభావం కూడా జూలై 2022లో తొలగిపోతుంది. దీనితో ప్రతీ పనిలోనూ ఆటంకాలు తగ్గి.. విజయాలు వరిస్తాయి. మరి ఆ రాశుల ఏంటో.? అందులో మీరున్నారో.? లేదో ఇప్పుడు చూద్దాం..

వృషభరాశి:

ఇన్నాళ్లు కష్టాలు మోస్తూ వస్తోన్న ఈ రాశివారికి త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం రాహువు వృషభరాశిలో ఉండగా.. జూలై 12, 2022న ఈ రాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తర్వాత వృషభరాశి వారి జీవితాల్లో సమస్యలన్నీ తొలిగిపోతాయి. అనేక విజయాలను అందుకుంటారు. చెడు అలవాట్లకు, సహవాసాలకు దూరంగా ఉండండి. అలాగే వీలైనప్పుడల్లా జంతువులకు ఆహారాన్ని పెట్టండి.

మిధునరాశి:

ఈ రాశివారు శని మహాదశ నుంచి తొందర్లోనే విముక్తిని పొందుతారు. 2022 ఏప్రిల్ 29న శనిగ్రహం ఈ రాశి నుంచి మరో దానిలోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా మిధునరాశి వారి జీవితాల్లో సమస్యలు తొలిగిపోతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ లాంటివి లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి. అయితే కోపాన్ని, అహంకారాన్ని తగ్గించుకోండి. వృద్ధులకు, స్త్రీలను గౌరవించండి.

మీనరాశి:

ఈ రాశివారికి నూతన సంవత్సర గ్రహస్థితి చాలా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్‌లో విజయాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి లభించవచ్చు. ఈ సంవత్సరం మొత్తం ఈ మీనరాశి వారు ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. అయితే స్వార్థపూరిత, మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.

Also Read:

చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!

మూవీ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈ నెలలో ఓటీటీ రిలీజ్‌లు ఇవే.. లిస్టులో బడా సినిమాలు!