Horoscope Today: ఈ రాశులవారికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి.. ఉద్యోగ మార్పులు..
తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో రాశి ఫలాలను విశ్వసిస్తుంటారు.
తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో రాశి ఫలాలను విశ్వసిస్తుంటారు. తమ రాశి ప్రకారం… రోజులో తమకు ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. ఈరోజు జనవరి 6న చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తుంటాడు. దీంతో ఈరోజు పలు రాశులలో ప్రభావం ఉంటుంది. మరీ ఈరోజు రాశి ఫలాలు గురించి తెలుసుకుందామా.
మేష రాశి.. ఈరోజు వీరికి కుటుంబ పరిస్థితులు సరిగ్గా ఉండవు. చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం తగ్గుతుంది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ప్రశాంతత ఉండదు.
వృషభ రాశి.. ఈరోజు వీరు అనుకోని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎదుర్కోంటారు. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
మిథున రాశి.. ఈరోజు వీరికి రుణభాధలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృథా ఖర్చులు చేస్తారు. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు.
సింహా రాశి.. ఈరోజు వీరు అనుకున్న పనులు సులభంగా పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ఫలితం వస్తుంది. సమజంలో గౌరవమర్యదలు పెరుగుతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. శుభకార్యాలు చేస్తారు.
కన్య రాశి.. ఈరోజు వీరికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులు.. కుటుంబసభ్యుల సహాకారం అందుతుంది. సరైన ఆలోచనలు చేస్తారు. అనుకున్న పనిని పూర్తిచేస్తారు.
తుల రాశి.. ఈరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈరోజు వీరు ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి ఉద్యోగ రీత్యా స్థానచలనం కలిగే అవకాశం ఉంది. ఇంటి మార్పు చేస్తారు. విమర్శలు ఎదుర్కోంటారు. ఖర్చులు ఎక్కువవుతాయి. రుణ ప్రయత్నాలు విజయం అవుతాయి.
ధనుస్సు రాశి.. ఈరోజు వీరు అనుకోని దూర ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు ఎదుర్కోంటారు. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటారు.
మకర రాశి.. ఈరోజు వీరి మనస్సు ప్రశాంతంగా ఉండదు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనుకోని గొడవలలో ఉండిపోతారు. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి.
కుంభ రాశి.. ఈరోజు వీరికి మానసిక ప్రశాంతత ఉండదు. ఇంటి మార్పులు చేసే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.
మీన రాశి.. ఈరోజు వీరు ఉద్యోగ రీత్యా స్థానచలనం చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యల భారిన పడతారు. ఆస్తి విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
Gali Janardhan Reddy Son: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి కొడుకు.. దర్శకుడు ఎవరంటే..
Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..