- Telugu News Photo Gallery Cinema photos Upcoming Movies Release In OTT January 2022 Here is the detail
OTT Movies: మూవీ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈ నెలలో ఓటీటీ రిలీజ్‌లు ఇవే.. లిస్టులో బడా సినిమాలు!
కరోనా కారణంగా భారతదేశంలో ఓటీటీ మార్కెట్ దూసుకుపోతోందని చెప్పొచ్చు. వైరస్‌పై ఉన్న భయంతో జనాలు ఎక్కువగా ఓటీటీలకు అలవాటుపడ్డారు. ఈ తరుణంలో గత ఏడాది చివర్లో థియేటర్లలో సందడి చేసిన పలు సినిమాలతో పాటు..
Updated on: Jan 06, 2022 | 6:43 AM

కరోనా కారణంగా భారతదేశంలో ఓటీటీ మార్కెట్ దూసుకుపోతోందని చెప్పొచ్చు. వైరస్‌పై ఉన్న భయంతో జనాలు ఎక్కువగా ఓటీటీలకు అలవాటుపడ్డారు. దీనితో క్రమంగా ఓటీటీలకు కూడా ప్రజాదరణ ఎక్కువైంది. ఈ తరుణంలో గత ఏడాది చివర్లో థియేటర్లలో సందడి చేసిన పలు సినిమాలతో పాటు.. కొన్ని డైరెక్ట్ రిలీజ్‌లు ఈ నెలలో ఓటీటీలలో సందడి చేయనున్నాయి. అవేంటో చూసేద్దాం పదండి.!

అల్లు అర్జున్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం 'పుష్ప'. ఈ సినిమా జనవరి 7వ తేదీ రాత్రి 8 గంటల నుంచి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ కానుంది.

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన 'వరుడు కావలెను' సినిమా జనవరి 7న జీ5 యాప్ ద్వారా స్ట్రీమింగ్ కానుండగా.. నాగశౌర్య హీరోగా వచ్చిన మరో సినిమా 'లక్ష్య' కూడా జనవరి 7న ఆహా వీడియో ద్వారా స్ట్రీమింగ్ కానుంది.

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన 'అఖండ' జనవరి 21న డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. రోషన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'పెళ్లి సందD' సినిమా జనవరి 14న డిస్నీ + హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది.

అటు నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సబాస్టియన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ తెరకెక్కించిన 'శ్యామ్ సింగ్ రాయ్' జనవరి 26వ తేదీన నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇక చియాన్ విక్రమ్, ధృవ్ విక్రమ్ కలిసి నటిస్తోన్న మాహాన్ మూవీ జనవరి 26న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు.

అలాగే Gehraiyaan(జనవరి 25, అమెజాన్ ప్రైమ్), ఎటర్నల్స్(జనవరి 12, డిస్నీ + హాట్ స్టార్), విరాటపర్వం(నెట్‌ఫ్లిక్స్), రాజావిక్రమార్క(ఆహా వీడియో)లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఏదైనా ఏమైనా కొన్ని చిత్రాలకు అఫీషియల్ ప్రకటన రాగా.. మరికొన్నింటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




