Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. ఈ రోజు రాశిఫలాలు

Today Horoscope: నిత్యం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను

Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. ఈ రోజు రాశిఫలాలు
Horoscope Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 07, 2022 | 6:44 AM

Today Horoscope: నిత్యం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. కావున శుక్రవారం (జనవరి 7న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేషం: ఈ రాశివారు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. పెద్దల సలహాలు పాటించాలి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృషభం: ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి ముందుకుసాగాలి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాలతో కొత్త పనులను ప్రారంభించాలి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం: ఈ రోజు ఈ రాశివారు.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పనులు మొదలుపెడితే.. మేలు జరుగుతుంది. సన్నిహితుల నుంచి అవసరానికి తగిన సాయం అందుతుంది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం: ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పకీ.. పట్టుదలతో ముందడుగు వేస్తే పనులు పూర్తవుతాయి. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. కుటుంబసభ్యుల నుంచి సహకారం అందుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి.

సింహం: ఈ రాశి వారికి శుభకాలం. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తోటివారి సలహాలు సూచనలు పాటిస్తే మేలు జరుగుతుంది. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

కన్య: ఈ రోజు బుద్ధిబలం, మనోబలంతో చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టమైన వారితో సరదాగా గడుపుతారు. అవసరానికి అనుగుణంగా ముందుకుసాగాలి.

తుల: ఈ రాశి వారికి శ్రమ అధికం అవుతుంది. బలమైన ప్రయత్నాలతో పనులు పూర్తవుతాయి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.

వృశ్చికం: పనులకు ఆటంకం ఏర్పడకుండా ప్రణాళికతో ముందుకుసాగాలి. ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. బలమైన ప్రయత్నాలు చేస్తే ఫలితం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు.

ధనుస్సు: ఈ రాశివారు శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో కలిసి భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు పాటించాలి. ధైర్యంతో ముందుకు సాగాలి. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు.

మకరం: ఈ రోజు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కీలక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై దృష్టిసారించాలి.

కుంభం: ఈ రాశివారికి శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకుసాగితే ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. గొడవలకు దూరంగా ఉండాలి.

మీనం: ఈ రాశివారు ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. ఇబ్బందులు ఎదురైనా పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఆరోగ్యంపై దృష్టిసారించాలి.

Also Read:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు..!

Black Raisin: నల్ల ఎండుద్రాక్ష ఆరోగ్యానికి నిధి.. చలికాలంలో రోజూ తింటే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు!