Horoscope Today: ఆ రాశి వారు శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (June 3, 2025): మేష రాశి వారికి ఆర్థికంగా ఊహించని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. బాగా సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. మిథన రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (జూన్ 3, 2025): మేష రాశి వారికి ఆర్థికంగా ఊహించని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారు బాగా సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. మిథన రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థికంగా ఊహించని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు అంచనాల్ని మించుతాయి. బంధువులు కొందరు బాగా ఇబ్బంది కలిగిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. బాగా సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా కొనసాగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొన్ని ముఖ్య మైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకరిద్దరు బంధు మిత్రులకు ఆర్థికంగా ఉపయోగపడతారు. ఆరోగ్యానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఆశించిన లాభాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలను సొంతగా సరిదిద్దుకోవడం మంచిది. కొందరు బంధువుల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక విషయాలు రాణిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గుతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది మార్పులతో లబ్ధి పొందుతారు. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. కష్టార్జితం పెరుగుతుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మదుపులు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనేక విధాలుగా ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాల్లో మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా ముందుకు సాగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. తలపెట్టిన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యంగా షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యాపారాల్లో మీ శ్రమ, కృషి వల్ల లాభాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సొంత విషయాల మీద శ్రద్ద పెట్టడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆదాయ వృద్దికి అనేక విధాలుగా ప్రయత్నించే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆస్తి వివాదం రాజీమార్గంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్ననాటి మిత్రులతో కాలక్షేపం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారాల్లో మార్పులు చేపడ తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రోజంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయిలో సఫలం అవుతాయి. ఉద్యోగంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు కొద్దిగా అనుకూలంగా సాగి పోతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలు విస్తరిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా ఉంటాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు బాగా సంతృప్తికరంగా సాగిపోతాయి.



