AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుజ కేతువులతో ఆ రాశులకు విజయ పరంపర..! ఆర్థికంగా, కెరీర్ పరంగా పురోగతి

Telugu Astrology: జూన్ 27 నుండి జూలై 28 వరకు కుజుడు, కేతువు సింహ రాశిలో సంచరిస్తారు. ఈ యుతి మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కుజ కేతువుల సంయోగం వల్ల ఆదాయం పెరుగుదల, ఉద్యోగంలో పదోన్నతి, భూ లాభాలు లభించే అవకాశం ఉంది. కొన్ని రాశుల వారికి అధికారం, ధన లాభాలు కూడా కలుగుతాయి.

కుజ కేతువులతో ఆ రాశులకు విజయ పరంపర..! ఆర్థికంగా, కెరీర్ పరంగా పురోగతి
Telugu Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 03, 2025 | 5:01 AM

Share

Kuja Ketu Transit in Leo: జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు, కేతువు దాదాపు ఒకే రకంగా వ్యవహరిస్తారు. ఈ రెండు గ్రహాల లక్షణాలు ఒకటే. ఈ నెల (జూన్) 27 నుంచి జూలై 28 వరకు ఈ రెండు గ్రహాలు కలిసి సింహ రాశిలో సంచారం చేయబోతున్నాయి. ఈ రెండు గ్రహాల ఉమ్మడి సంచారం కొన్ని రాశులకు అత్యధికంగా మేలు చేసే అవకాశం ఉంది. విపరీతంగా ధన దాహం, అధికార దాహం, భూ దాహం కలిగిన కుజుడితో కేతువు కలవడం వల్ల ఈ లక్షణాలకు మరింత ఊతం లభిస్తుంది. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశుల వారు ఈ రెండు గ్రహాల యుతితో తప్పకుండా ఆర్థికంగా, కెరీర్ పరంగా పురోగతి చెందడం జరుగుతుంది.

  1. మేషం: నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు అధికారాన్ని, అత్యధిక ఆదాయాన్ని కోరుకునే ఈ రాశివారి కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. రాశ్యధిపతి కుజుడు పంచమ స్థానంలో, తన మిత్రుడైన రవి క్షేత్రంలో కుజుడితో కలిసి ఉండడం వల్ల వీరిలోని శక్తి యుక్తులు, అవకాశాలను అందిపుచ్చుకునే తత్వం మరింతగా రాణిస్తాయి. జూలై 28లోగా ఈ రాశివారు ఉద్యోగంలో మంచి పదవిని పొందడంతో పాటు, ఆదాయాన్ని తప్పకుండా వృద్ధి చేసుకునే అవకాశం ఉంది.
  2. మిథునం: దూర దృష్టికి, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడానికి, పట్టుదలకు, ప్రయత్నాలకు మారుపేరైన ఈ రాశివారు అదనపు ఆదాయం కోసం ఏ అవకాశాన్నీ జారవిడుచుకునే అవకాశం ఉండదు. ఈ రాశికి లాభాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో కేతువులో కలిసి సంచారం చేయడం వల్ల మరింత ఎక్కువ జీతభత్యాలు ఇచ్చే ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఈ రాశివారి పట్టుదల, ప్రయత్నాలు ఫలించి ఆదాయం పెరగడంతో పాటు భూ లాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి.
  3. కర్కాటకం: మనసులో కోరిక కలగడం తరువాయి, దాన్ని సాధించుకోవడానికి వ్యూహాలు, ప్రణాళికలు రచించే ఈ రాశికి ధన స్థానంలో కుజ కేతువులు సంచారం చేయడం వల్ల అదనపు ఆదాయ మార్గాల మీద శ్రద్ధను పెంచడం, ఆదాయ మార్గాలను విస్తరించుకోవడం జరుగుతుంది. ఈ రాశివారు షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా వివిధ మార్గాల్లో తమ బ్యాంక్ బ్యాలెన్స్ ను బాగా పెంచుకునే అవకాశం ఉంది. పోటీలను అధిగమించి పదవులు పొందే అవకాశం కూడా ఉంది.
  4. సింహం: నాయకత్వ లక్షణాలు, అధికార దాహం కలిగి ఉండడంతో పాటు ఏ విషయంలోనైనా రికార్డులు సృష్టించాలనుకునే ఈ రాశివారు కుజ కేతువుల యుతితో ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని అందలాలు ఎక్కే అవకాశం ఉంది. ఈ రాశివారు తమ శక్తియుక్తులతో ప్రత్యర్థులను, పోటీ దార్లను చిత్తు చేసే సూచనలున్నాయి. జూలై ఆఖరు లోగా వీరి ఆదాయం అంచనాలను మించి తప్పకుండా పెరుగుతుంది. వీరిలోని ఉడుంపట్టు ఫలించి తమ లక్ష్యాలను సాధించుకుంటారు.
  5. తుల: వ్యాపార లక్షణాలు, సమయస్ఫూర్తి, నైపుణ్యాలు ఎక్కువగా కలిగి ఉండే ఈ రాశికి లాభ స్థానంలో కుజ కేతువుల యుతి జరుగుతున్నందువల్ల ఈ రాశివారు ఆదాయ వృద్ది మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఏదో విధంగా కోటీశ్వరులు కావాలనే వీరి లక్ష్యం జూలై ఆఖరు లోగా తప్ప కుండా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్ధతను పోగొట్టి పరుగులు పెట్టిస్తారు. వీటిల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల విశేషంగా లాభాలు పొందుతారు.
  6. వృశ్చికం: వ్యూహాలు రచించడంతో పాటు, వాటిని అమలు చేయడానికి నలుగురినీ కూడగట్టుకునే తత్వం కలిగిన ఈ రాశికి అధిపతి కుజుడు అయినందువల్ల వీరు ఆదాయ వృద్ధిలోనూ, అధికారాన్ని చేపట్టడంలోనూ రికార్డులు సృష్టిస్తారు. ఎటువంటి పోటీ ఎదురైనా పైచేయి సాధిస్తారు. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరు. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి పెడతారు. వీరికి అధికార యోగంతో పాటు ఆదాయ వృద్ధికీ అవకాశం ఉంది.