Sunday Astro Tips: పొరపాటున కూడా ఆదివారం ఈ 6 పనులు చేయకండి.. దారిద్య్రాన్ని కొని తెచ్చుకున్నట్లే..

సూర్యభగవానుడి అనుగ్రహం పొందిన వ్యక్తులు జీవితంలో చాలా పురోగతిని సాధిస్తారు. అన్ని సమస్యలను తొలగిస్తాడని, ఇంట్లో సుఖ సంపదలు ఉంటాయని విశ్వాసం. అందుకనే ఆదివారం సూర్యభగవానుడి పూజపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. అయితే ఆదివారం పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులున్నాయి.

Sunday Astro Tips: పొరపాటున కూడా ఆదివారం ఈ 6 పనులు చేయకండి.. దారిద్య్రాన్ని కొని తెచ్చుకున్నట్లే..
Sunday Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Aug 06, 2023 | 12:24 PM

హిందూమతంలో ఆదివారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు గ్రహాల రాజుగా పరిగణించబడే సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఆదివారం సూర్య భగవానుడికి నీటిని సమర్పించి, హృదయపూర్వకంగా పూజించిన వారి ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. సూర్యభగవానుడి అనుగ్రహం పొందిన వ్యక్తులు జీవితంలో చాలా పురోగతిని సాధిస్తారు. అన్ని సమస్యలను తొలగిస్తాడని, ఇంట్లో సుఖ సంపదలు ఉంటాయని విశ్వాసం. అందుకనే ఆదివారం సూర్యభగవానుడి పూజపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. అయితే ఆదివారం పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులున్నాయి. ఈ పనులు చేయడం వలన అనేక కష్టనష్టాలు ఎదుర్కోవల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆదివారం పొరపాటున కూడా చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..

ఆదివారం ఏమి చేయకూడదంటే

  1. పొరపాటున కూడా సూర్య భగవానుడికి సంబంధించిన వస్తువులను ఆదివారం అమ్మకూడదు. వీటిలో రాగితో చేసిన వస్తువులు కూడా ఉన్నాయి. వీటిని అమ్మడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలహీనపడుతుంది.
  2. ఆదివారం నీలం, గోధుమ, నలుపు రంగుల దుస్తులను ధరించ వద్దు. ఆదివారం రోజున ఈ రంగుల దుస్తులను ధరించడం శ్రేయస్కరం కాదు.
  3. హిందూ సనాతన ధర్మంలోని నమ్మకాల ప్రకారం ఆదివారం జుట్టు కత్తిరించుకోవడం కూడా శుభప్రదంగా పరిగణించబడదు. దీని వల్ల ప్రతి పనికి ఆటంకం ఏర్పడి ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది.
  4. ఆదివారం పడమర దిశలో ప్రయాణించడం మానుకోవాలి ఎందుకంటే ఈ రోజున శూలం పశ్చిమ దిశలో ఉంటుంది.. అందుకనే ఈ దిశలో ప్రయాణం నిషేధించబడింది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఆదివారం ఆలస్యంగా మేల్కొనడం మంచిది కాదు. ఇలా చేయడం జాతకంలో సూర్యుడి స్థానాన్ని కూడా బలహీనపరుస్తుంది. రోజంతా భారంగా ఉంటుంది.
  7. ఆదివారం ఉప్పు వాడకం కూడా సరైనది కాదు. దీంతో ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయని నమ్ముతారు. ఆదివారం నాడు ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఉప్పుని తీసుకోవడం శ్రేయస్కరం కాదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)