Sun Transit: ముగిసిన సూర్య-శని అశుభ యోగం.. నేటి నుంచి నెల రోజులపాటు ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..
గురు రాశిలోకి సూర్యుడు అడుగు పెట్టడంతో ఖర్మలు మొదలయ్యాయి. దీంతో వివాహం, నిశ్చితార్థం, క్షవరం, గృహోపకరణం వంటి శుభకార్యాలు ఒక నెల పాటు కుదరవు. సూర్యుడు బృహస్పతి రాశిలోకి ప్రవేశించిన వెంటనే సూర్యుడు-శని మైత్రి ముగిసింది.
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు. దీనిని సూర్య సంక్రాంతి అంటారు. మార్చి 15వ తేదీ బుధవారం కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు. ఏప్రిల్ 14 వరకు సూర్యుడు మీనరాశిలో ఉంటాడు. ఈ రాశిలో సూర్యుడు తన మిత్రుడైన బృహస్పతి రాశిలోకి ప్రవేశించాడు. నిన్నటి వరకూ సూర్యుడు మకరం.. కుంభరాశిలో తన కుమారుడు శనీశ్వరుడు రాశిలో సుమారు రెండు నెలల పాటు ఉన్నాడు. తండ్రి తనయుడైన సూర్యుడు, శనీశ్వరుడి మధ్య శత్రుత్వం ఉన్నందున వారి మధ్య సఖ్యత లేదు. అయితే సూర్యుడు ఇప్పుడు తన రాశిని మార్చుకోవడంతో సూర్యుడు-శనిగ్రహాల అశుభ కలయిక ముగిసింది.
అదే సమయంలో గురు రాశిలోకి సూర్యుడు అడుగు పెట్టడంతో ఖర్మలు మొదలయ్యాయి. దీంతో వివాహం, నిశ్చితార్థం, క్షవరం, గృహోపకరణం వంటి శుభకార్యాలు ఒక నెల పాటు కుదరవు. సూర్యుడు బృహస్పతి రాశిలోకి ప్రవేశించిన వెంటనే సూర్యుడు-శని మైత్రి ముగిసింది. దీంతో వృషభం, మిథునం, తుల, మకర రాశి వారికి మంచి సమయం ప్రారంభమైంది.
ముగిసిన అశుభ కాలం.. వేద జ్యోతిషశాస్త్రంలో,. ఏ రాశిలోనైనా సూర్యుడు, శని కలయిక మంచిదిగా పరిగణించబడదు. సూర్యుడు కుంభరాశిలో శని రాశిలో ఉండటం వల్ల ఆ రాశి వారికీ అన్నీ కష్టాలే. ఇప్పుడు సూర్యుడు మీన రాశిలోకి రావడంతో సూర్య-శని మైత్రికి తెరపడింది. దీని కారణంగా మళ్ళీ కొన్ని రాశుల వారికి మళ్లీ సూర్యుడు శుభ ఫలితాలను ఇస్తాడు. టెన్షన్, వివాదాలు తగ్గుముఖం పడతాయి. అధికారులతో ఏర్పడిన ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. పరిపాలనా నిర్ణయాల్లో వేగం ఉంటుంది. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి.
సూర్యుని రాశి మార్పు ఈ 4 రాశుల వారికి శుభప్రదం జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే వృషభ, మిథున, తుల, మకర రాశుల వారికి మళ్లీ మంచి రోజులు మొదలవుతాయి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఉన్న ఈ నాలుగు రాశుల వారికి ఒక నెల పాటు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ నాలుగు రాశుల వారికి రాబోయే రోజుల్లో అదృష్టము కలుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో మంచి విజయం లభిస్తుంది. ధన లాభానికి అవకాశాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాల్లో పెరుగుదల ఉంటుంది. సమాజంలో గౌరవం, కీర్తి ఉంటుంది.
ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి సూర్యుడు మీన రాశిలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారికి సమస్యలు పెరగవచ్చు. మేష, సింహ, కుంభ, మీన రాశుల వారికి ఒక నెల మంచిది కాదు. పరస్పర వివాదాలు పెరగవచ్చు. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభించదు. డబ్బు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యంలో ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. మరోవైపు
కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడం వలన సాధారణ ఫలితాలు పొందుతారు. సూర్యుని రాశి మారడం వల్ల ఈ రాశుల స్థానికుల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ ఉండవు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)