Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar eclipse: వచ్చే నెలలో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే, ఇందులో మీరున్నారో చూసుకోండి.

ఈ నెల 22వ తేదీన ఉగాదితో తెలుగు కొత్తేడాది ప్రారంభమవుతోంది. శుభకృత్‌ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. అయితే తెలుగు కొత్తేడాది మొదలైన నెల రోజుల్లో తొలి సూర్య గ్రహణ రాబోతోంది. ఏప్రిల్‌ 20వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుంది...

Solar eclipse: వచ్చే నెలలో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే, ఇందులో మీరున్నారో చూసుకోండి.
Zodiac Signs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 16, 2023 | 12:47 PM

ఈ నెల 22వ తేదీన ఉగాదితో తెలుగు కొత్తేడాది ప్రారంభమవుతోంది. శుభకృత్‌ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. అయితే తెలుగు కొత్తేడాది మొదలైన నెల రోజుల్లో తొలి సూర్య గ్రహణ రాబోతోంది. ఏప్రిల్‌ 20వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఉదయం 7.05 నిమిసాల నుంచి మధ్యాహ్నం 12.29 గంటల వరకు గ్రణం ఏర్పడనుంది.

ఇదిలా ఉంటే సూర్యగ్రహణ ప్రభావం భారత్‌లో పాక్షికంగా ఉన్నప్పటికీ.. ఇది జ్యోతిషశాస్త్రంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే 12 రాశుల్లో కొందరిపై ప్రతికూల ప్రభావం ఉంటే మరికొందరిపై అనుకూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా వచ్చే నెలలో రానున్న సూర్య గ్రహం వల్ల మూడు రాశుల వారికి మాత్రం విజయాలు దక్కుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏంటంటే..

వృషభ రాశి:

సూర్యగ్రహణం వల్ల వృషభ రాశి వారికి మేలు జరగనుంది. ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వీరికి జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ప్రమోషన్స్‌ పొందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మిథున రాశి:

మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోల్పోయిన డబ్బును తిరిగి పొందగలరు. చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత వ్యాపారం ఉన్న వారు వ్యాపారంలో వృద్ధిలోకి వస్తారు.

ధనస్సు రాశి:

ఈ రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా అదృష్టం వరిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైన కొత్త అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక, కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం కానుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం క్లిక్ చేయండి..