Zodiac Signs: ఆ రెండు కీలక గ్రహాలతో రవి కలయిక.. ఆ రాశుల వారి జీవితాలు కొత్త పుంతలు..!
కర్కాటక రాశిలో ఇప్పటికే శుక్ర, బుధులు సంచారం చేస్తుండగా, 16 నుంచి రవి కూడా ఈ రెండు గ్రహాలతో కలవడం జరుగుతుంది. కర్కాటకం వంటి చర రాశిలో ఈ మూడు గ్రహాలు కలవడం వల్ల కొన్ని రాశుల వారిలో బద్ధకం వదిలి, విపరీతంగా యాక్టివిటీ పెరుగుతుంది. క్రియాశీలంగా మారిపోయే అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశిలో ఇప్పటికే శుక్ర, బుధులు సంచారం చేస్తుండగా, 16 నుంచి రవి కూడా ఈ రెండు గ్రహాలతో కలవడం జరుగుతుంది. కర్కాటకం వంటి చర రాశిలో ఈ మూడు గ్రహాలు కలవడం వల్ల కొన్ని రాశుల వారిలో బద్ధకం వదిలి, విపరీతంగా యాక్టివిటీ పెరుగుతుంది. క్రియాశీలంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు వగైరాలన్నీ ఒక్కసారిగా ఊపందుకుంటాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారి జీవితాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
- మేషం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో బుధ, శుక్ర, రవుల యుతి జరుగుతున్నందువల్ల గృహ నిర్మా ణాలు, వాహన సంబంధమైన విషయాలు ఊపందుకుంటాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. రావలసిన డబ్బును వసూలు చేసుకునే పనిలో నిమగ్నం అవుతారు. ఆస్తి వ్యవహారాలను ఒక కొలిక్కి తీసుకు వస్తారు. ఆస్తి వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు.
- మిథునం: ఈ రాశికి రెండవ స్థానంలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల ధన, కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధను పెంచుతారు. రావలసిన డబ్బును, బాకీలను వసూలు చేసుకోవడం జరుగుతుంది. బ్యాంక్ నిల్వలను వృద్ధి చేసుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. వ్యవహార దక్షతను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇంటి పరిస్థితులను మెరుగుపరచడానికి, ఇంటి అవసరాలను తీర్చడానికి నడుం బిగిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గించుకుంటారు.
- కర్కాటకం: ఈ రాశిలో మూడు శుభగ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి ఓ నెల రోజుల పాటు విశ్రాంతికి అవకాశం ఉండదు. కార్యకలాపాలు, ప్రయత్నాలు బాగా వృద్ధి చెందుతాయి. సంపన్నుల స్థాయికి వెళ్లాలన్న ఆలోచన పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి సారిస్తారు. జీవన శైలిలో మార్పు వస్తుంది. కొన్ని కీలక విషయాల్లో బద్ధకం వదిలిపోతుంది. ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ అభివృద్ధి సాధించడానికి, రాబడి పెంచుకోవడానికి అత్యధికంగా శ్రమపడతారు.
- కన్య: ఈ రాశివారికి లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో సహా మూడు గ్రహాలు చేరడం వల్ల కార్యకలా పాలన్నీ విస్తరించడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు బాగా పదును పెడతారు. వృత్తి, వ్యాపారాలను కొత్త నైపుణ్యాలతో కొత్త పుంతలు తొక్కిం చడం జరుగుతుంది. ఆదాయాన్ని వృద్ధి చేయడమే లక్ష్యంగా చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటారు.
- తుల: ఈ రాశివారికి దశమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో రెండు గ్రహాలు కలవడం వల్ల విశ్రాంతి లభించని జీవితం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు పెరుగు తాయి. ఎంతటి శ్రమకైనా ఓర్చుకుని ఉద్యోగంలో బరువు బాధ్యతలను నెత్తికెత్తుకోవడం జరుగు తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా లాభసాటి ప్రయాణాలకు అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల జీవనశైలిని మార్చుకోవడం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయార్జనలో ఒక్క క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా రాబడిని పెంచుకోవడం మీద దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కోసం మరింత ఎక్కువగా శ్రమపడే అవకాశం ఉంది. పెండింగు పనులన్నీ పూర్తి చేస్తారు. ఆస్తి విషయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తారు. ఖర్చు తగ్గించుకుని పొదుపు పాటిస్తారు.